నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అధిక ప్రాధానత్య ఇవ్వాలి – గృహనిర్మాణ శాఖపై సమీక్షలో సీఎం జగన్‌

CM YS Jagan Mohan Reddy Held Review Meet on Housing Construction Department of AP Today, AP CM YS Jagan Mohan Reddy Held Review Meet on Housing Construction Department of AP Today, AP CM YS Jagan Held Review Meet on Housing Construction Department of AP Today, AP CM Held Review Meet on Housing Construction Department of AP Today, Review Meet on Housing Construction Department of AP, Housing Construction Department of AP Review Meet, Review Meet On AP Housing Construction Department, Housing Construction Department, AP Housing Construction Department, AP Housing Construction Department News, AP Housing Construction Department Latest News, AP Housing Construction Department Latest Updates, AP Housing Construction Department Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గృహనిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షలో భాగంగా సీఎం జగన్ సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. గృహ నిర్మాణం మరింత వేగవంతంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

సీఎం జగన్ ఆదేశాలు..
  • నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి మొదటి ప్రాధానత్య ఇవ్వాలి.
  • విశాఖలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరగాలి. అలాగే జగనన్న కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టిపెట్టాలి.
  • ఆప్షన్‌ ‘మూడు’ కింద ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.
  • డ్రైనేజీ, నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాల కల్పన, వాటి నాణ్యత విషయంలో దృష్టి సారించాలి.
  • జగనన్న కాలనీల్లో పనుల ప్రగతి సమీక్షించడానికి మరియు సందేహాల నివృత్తికి వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ఒక ఫోన్‌ నంబర్‌ను కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశం.
  • టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులతో పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియనూ వేగవంతం చేయాలి.
  • అర్హులకు 90 రోజుల్లో ఇంటిపట్టా అందించడమే కాకుండా లబ్ధిదారుని స్థలం ఎక్కడ ఉందో కూడా చూపించాలని ఆదేశం.
  • కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి 2,03,920 మందిని కొత్తగా తేల్చామని, వీరిలో ఇప్పటికే లక్షమంది వరకు పట్టాలు అందించామన్న అధికారుల వివరణపై స్పందిస్తూ.. మిగిలిన వారికీ వీలైనంత త్వరలో పట్టాలు అందించాలని ఆదేశం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 15 =