టీ20 ప్రపంచకప్‌-2022లో భారత్ జట్టు జర్నీ, ఓటమిపై భావోద్వేగంతో స్పందించిన విరాట్ కోహ్లీ

T20 World Cup-2022: Team India Star Batter Virat Kohli Emotional Tweet over India's Journey and Exit, India's Journey In T20 World Cup-2022, Virat Kohli Reacts Emotionally To Defeat,T20 World Cup 2022,Mango News,Mango News Telugu,T20 Worldcup Latest News And Updates,T20 World Cup News And Live Updates, Pakistan T20 Worldcup,India T20 worldcup, Viart Kohli, Rizwan,Indian Team Captian,Pakistan Team Captain, Rohit Sharma,Indian Cricket Team

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్-2022లో భాగంగా గురువారం అడిలైడ్‌ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్‌లో భారత్ జట్టు పరాజయం పాలైన విషయం తెలిసిందే. కీలక సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ పై ఇంగ్లాండ్ ప‌ది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్ కు చేరి, కప్ కొట్టాలన్నా లక్ష్యం నెరవేరకుండానే టోర్నమెంట్ నుంచి ఇంటిముఖం పట్టాల్సిరావడంతో భారత్ ఆటగాళ్లు, దేశంలో క్రీడాభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కాగా టీ20 ప్రపంచకప్‌-2022లో భారత్ జట్టు జర్నీ, ఓటమిపై స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. లక్ష్యం చేరకుండానే ఇండియాకు తిరిగిరావడంపై భావోద్వేగంతో ట్వీట్ చేశాడు.

“మేము మా కలను సాధించకుండానే ఆస్ట్రేలియన్ తీరాలను వదిలివెళ్తున్నాం మరియు మా హృదయాలలో తీవ్ర నిరాశ నెలకుంది. కానీ మేం ఓ జట్టుగా చాలా చిరస్మరణీయమైన క్షణాలను తిరిగి తీసుకెళ్తున్నాం. ఇక్కడి నుండి మరింత మెరుగుపడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. స్టేడియాలలో మాకు మద్దతు ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులందరికీ ధన్యవాదాలు. ఈ జెర్సీని ధరించి, మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఎల్లప్పుడూ గర్వంగా భావిస్తున్నాను” అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు.

మరోవైపు టీ20 ప్రపంచకప్‌-2022 ఆసాంతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ లు ఆడిన విషయం తెలిసిందే. మొత్తం 6 మ్యాచ్‌ల్లో 296 పరుగులు చేసిన కోహ్లీ, భారత్ జట్టు జర్నీలో కీలక పాత్ర పోషించాడు. 2014 టీ20 ప్రపంచకప్‌ లో 319 పరుగులు, 2016లో 273 పరుగులు, 2022లో 296 పరుగులతో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ ఈవెంట్ చివరిలో భారత్ జట్టు బోల్తా పడుతుండడంతో కప్ దక్కకుండా పోతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − six =