జగనన్న తోడు: 3.70 లక్షల చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున రుణం జమ

370 Crores Under Jagananna Thodu Scheme, Andhra govt Jagananna Thodu Scheme, CM YS Jagan Released Rs 370 Crores Under Jagananna Thodu Scheme, CM YS Jagan Released Rs 370 Crores Under Jagananna Thodu Scheme Today, Jagananna Thodu, Jagananna Thodu Scheme, Jagananna Thodu Scheme 2021, Jagananna Thodu Scheme Amount, Jagananna Thodu Scheme Amount Released, Jagananna Thodu Scheme News, Jagananna Thodu Scheme Updates, Mango News

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు రూపకల్పన చేసిన ‘జగనన్న తోడు’ పథకం రెండో విడత నిధులను మంగళవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‌విడుదల చేశారు. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందిస్తున్నారు. ఈ రోజు క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి, 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.370 కోట్ల వడ్డీలేని రుణాలను జమ చేశారు. ఈ రుణాలపై అయ్యే వడ్డీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో చిరువ్యాపారులకు మేలు చేసేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ముందుగా జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మందికి రుణాలను అందించామని, తాజాగా 3.70 లక్షల మందితో కలిపి మొత్తం 9 లక్షల 5 వేల మంది చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణం అందించినట్టు తెలిపారు. రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించి, ఆరునెలలకొకసారి వారందరికీ రుణాలు అందజేస్తామని, జగనన్న తోడు కార్యక్రమం నిరంతర పక్రియ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − nine =