జూన్ నెలలో జగనన్న తోడు, వాహన మిత్ర, వైఎస్ఆర్ చేయూత పథకాలు అమలు : సీఎం జగన్

CM YS Jagan Says Jagananna Thodu, Jagananna Thodu Scheme, Jagananna Thodu Scheme 2021, Jagananna Thodu Scheme Updates, Mango News, Vahana Mitra, Vahana Mitra Scheme, Vahana Mitra Scheme In AP, Vahana Mitra Scheme Updates, YS Jagan Says Jagananna Thodu Vahana Mitra, YSR Cheyuta Scheme, YSR Cheyuta Scheme 2021, YSR Cheyuta Scheme Updates, YSR Cheyuta Schemes will Implement In June, YSR Vahana Mitra Scheme

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంక్షేమ పథకాల అమలు, ప్రగతిపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జులై 8న దివంగత సీఎం వైఎస్ఆర్ పుట్టిన రోజు సందర్భంగా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ప్రారంభిస్తామని అన్నారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం చేపట్టనున్న మెడికల్ కాలేజీలకు ఈ నెల 30న శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. ఇక వచ్చే ఉగాది పండుగ నాటికి పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలకే ప్లాట్లు అందిస్తామని, ఇందుకోసం దాదాపు 17 వేల ఎకరాలు అవసరం పడుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు.

మరోవైపు రాష్ట్రంలో జూన్‌ నెలలో అమలు కానున్న సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. జూన్ 8వ తేదీన జగనన్న తోడు పథకం, జూన్‌ 15న వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం, జూన్ 22న వైఎస్ఆర్ చేయూత పథకం అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచి, సోషల్ ఆడిట్ తర్వాత మార్పులు, చేర్పులు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే జూన్‌ 31న పశ్చిమగోదావరి జిల్లాలో అమూల్‌-ఏపీ పాల ప్రాజెక్ట్‌ ను ప్రారంభించనున్నట్టు సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =