రేపటినుంచి వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్‌ భేటీలు.. ముందుగా కుప్పం నియోజకవర్గంపై దృష్టి

CM YS Jagan To Begin Interaction with Party Workers From Tomorrow First Focus on Kuppam Constituency, CM YS Jagan Says First Focus on Kuppam Constituency, CM YS Jagan To Begin Interaction with Party Workers From Tomorrow, AP CM YS Jagan To Begin Interaction with Party Workers From Tomorrow, YS Jagan To Begin Interaction with Party Workers From Tomorrow, AP CM YS Jagan Mohan Reddy To Begin Interaction with Party Workers From Tomorrow, Interaction with Party Workers, YSRCP Party Workers, Party Workers, YSRCP Party Workers News, YSRCP Party Workers Latest News, YSRCP Party Workers Latest Updates, YSRCP Party Workers Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పార్టీ బాగు కోసం నిరంతరం పాటుపడుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆగస్ట్ 4వ తేదీ నుంచి పార్టీ కార్యకర్తలకు సమయం కేటాయిస్తానని 10 రోజుల క్రితం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనిలో భాగంగా రేపటినుంచి ఆయన రాష్ట్రం లోని అన్ని నియోజకవర్గాల కార్యకర్తలతో నేరుగా భేటీ అవనున్నారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవాలని భావిస్తున్న సీఎం జగన్.. ముందుగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంపై దృష్టి సారించారు.

ఈ క్రమంలో రేపు కుప్పం నియోజకవర్గం పరిధిలోని ముఖ్యమైన కార్యకర్తలను ఆయన నేరుగా కలుసుకోనున్నారు. భేటీలో భాగంగా కుప్పంలో పార్టీని బలోపేతం చేయడం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు, అమలు పరచాల్సిన ప్రణాళికలను చర్చించనున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడం, అలాగే నవరత్నాల కింద లబ్దిదారులకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం వంటి వాటి వాటిపై ప్రధానంగా చర్చించనున్నారు. కాగా రేపు మధ్యాహ్నాం సమయంలో ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇకపై సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం పరిధిలోని 50 మంది ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీలు కానున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here