వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్

Andhra Pradesh Floods, Andhra Pradesh Heavy rains, Andhra Pradesh Rains, AP CM Relief Fund For Flood Victims, AP CM YS Jagan, AP Flood Victims, AP Rains, AP Rains News, AP Weather report, Chittoor, CM YS Jagan Visits Flood Affected Areas In Nellore District, Heavy Rains In AP, Kadapa, Kadapa Heavy Rains, Mango News, Mango News Telugu, Nellore, Nellore Floods, Tirupati, Tirupati Rains, YS Jagan Visits Flood Affected Areas, YS Jagan Visits Flood Affected Areas In Nellore

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్నటినుంచి వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నిన్న వైస్సార్ కడప జిల్లాలో, చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఈ రోజు తిరుపతిలో కూడా కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి పర్యటన ముగించుకున్న అనంతరం ఆయన నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. అక్కడి అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎక్సిబిషన్ ద్వారా వరద ప్రభావాన్ని, నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సాధకబాధకాలను అడిగి తెలుసుకుంటున్నారు. వరదల వలన దెబ్బతిన్న పంటలను పరిశీలించి, పంట నష్టాన్ని రైతులని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని, నష్టపోయిన వారిని పూర్తిగా ఆదుకుంటామని ఆయన ప్రజలకు భరోసానిచ్చారు.

మొదట కేంద్రాన్ని వరద నష్టంపై అంచనాకు బృందాన్ని పంపాలని ఆయన కోరగా, కేంద్రం బృందం ఏర్పాటు చేసి పంపించింది. కేంద్ర బృందం పర్యటన తర్వాత వారు ముఖ్యమంత్రిని కలిసి సమీక్ష జరిపారు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్కడి అధికారులతో మాట్లాడి వరద నష్టంపై ఒక అంచనాకు వస్తున్నారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం తరఫునుంచి వారికి భరోసా కల్పిస్తూ తన పర్యటనని కొనసాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన అనంతరం ముఖ్యమంత్రి స్వయంగా ఒక నివేదికను కేంద్రానికి అందించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + fifteen =