ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం వైఎస్ జగన్

Andhra Pradesh Chief Minister, Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy, AP CM YS Jagan Mohan Reddy Likely To Visit Delhi, AP CM YS Jagan Mohan Reddy Likely To Visit Delhi On 10th June, AP CM YS Jagan Mohan Reddy To Visit Delhi On 10th June, Chief Minister of Andhra Pradesh, CM Jagan to visit Delhi, CM Jagan to visit Delhi tomorrow, Mango News, Prime Minister Of India, Union Home Minister Amit Shah, ys jagan mohan reddy, YS Jagan Mohan Reddy To Visit Delhi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి జూన్ 10, గురువారం నాడు ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం ఈ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మూడు రాజధానుల ఏర్పాటు సహా తాజా పరిస్థితులపై చర్చించే అవకాశమునట్టు సమాచారం. అలాగే అమిత్ షాతో పాటుగా పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు నిధులు, కరోనా వ్యాక్సిన్ల కేటాయింపు, విభజన హామీలపై సంబంధిత కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించనున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ తిరిగి శుక్రవారం మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ తాడేపల్లికి చేరుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here