ఘంటసాల కుమారుడు రత్నకుమార్ కన్నుమూత

chennai, Famous Dubbing Artist Passes Away In Chennai, Ghantasala, Ghantasala Ratnakumar, Ghantasala Ratnakumar Rao, Ghantasala Ratnakumar Rao Famous Dubbing Artist Passes Away In Chennai, Ghantasala Ratnakumar Rao Passes Away, Ghantasala Ratnakumar Rao Passes Away In Chennai, Ghantasala’s second son Ratnakumar passes away, Legendary singer Ghantasala Ratnakumar, Mango News, singer Ghantasala Venkateswara Rao

సుప్రసిద్ధ గాయకుడు, దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. ఇటీవలే రత్నకుమార్ కు కరోనా సోకగా, రెండు రోజుల క్రితమే కరోనా నెగిటివ్‌ గా తేలినట్టు తెలిపారు. అయితే గతంనుంచే కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్‌పై ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే చెన్నైలోని కావేరి హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రత్నకుమార్‌ ఆకస్మిక మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకుంది.

30 సంవత్సరాలకు పైగా ఆయన సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తమిళం, తెలుగు, మళయాలం, హిందీ సహా పలు భాషల్లో 1000కి పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. అలాగే తెలుగు, తమిళంలో వచ్చిన పలు సీరియళ్లలో వేల ఎపిసోడ్‌లకు ఆయన డబ్బింగ్ చెప్పారు. రత్నకుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here