జల వివాదంపై ప్రధాని మోదీ, జలశక్తి మంత్రి షెకావత్‌ కు లేఖలు రాసిన సీఎం వైఎస్ జగన్

AP-TS Water Disputes, CM YS Jagan Writes a Letter To PM, CM YS Jagan Writes a Letter To PM Modi over Water Disputes, CM YS Jagan Writes a Letter To PM Modi over Water Disputes Between Telugu States, Jagan writes to PM Modi over water disputes with Telangana, Krishna Water Disputes Tribunal, Mango News, Telangana AP Water Disputes, Water Disputes, water disputes between Andhra and Telangana, Water Disputes Between Telugu States, YS Jagan Mohan Reddy writes to PM Modi

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకున్న కృష్ణా జల వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ కు వేర్వేరుగా లేఖలు రాశారు. జల వివాదంపై తక్షణమే కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ఏకపక్షంగా నీటిని వినియోగిస్తుందని లేఖలో పేర్కొన్నారు. విద్యుత్‌ ఉత్పత్తికోసం నీటిని విడుదలచేయవద్దని కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్టాండర్ట్‌ ఆపరేషన్‌ ప్రోటోకాల్‌ను, ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా తెలంగాణ నీటిని విడుదల చేస్తుందని అన్నారు.

దీంతో దిగువ రాష్ట్రమైన ఏపీ ప్రయోజనాలు తీవ్రంగా తింటాయని, రాష్ట్రంలో రాయలసీమ తోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగునీటి సమస్యలు తీవ్రమవుతాయని, చెన్నై నగరానికి కూడా నీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు వస్తాయన్నారు. కేఆర్‌ఎంబీ అధికారపరిధిని వెంటనే నోటిఫై చేస్తూ కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రెండు రాష్ట్రాలకూ ఉమ్మడిగా ఉన్న రిజర్వాయర్లను పూర్తిగా కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని, ఉమ్మడి రిజర్వాయర్ల వద్ద సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో కేంద్రం భద్రత కల్పించి ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను కాపాడాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + fifteen =