ఏపీలో కరోనా వ్యాప్తి: ఒకేరోజు 3 జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్ కేసులు నమోదు

andhra pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, coronavirus latest news, Coronavirus live updates, COVID-19, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9747 కరోనా పాజిటివ్ కేసులు, 67 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 3 జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 1371, అనంతపూర్ లో 1325, కర్నూల్ లో 1016 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పుగోదావరి, కర్నూల్, అనంతపూర్, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలలో కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. దీంతో ఆగస్టు 4, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం‌ కేసుల సంఖ్య 176333 కు చేరింది. మరో 6953 మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 95625 కి చేరింది. ప్రస్తుతం 79104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1604 కి చేరుకుంది.

ఏపీలో జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:

  • తూర్పుగోదావరి – 24685
  • కర్నూల్ – 20695
  • అనంతపూర్ – 18801
  • గుంటూరు – 17821
  • విశాఖపట్నం – 15059
  • పశ్చిమ గోదావరి – 14406
  • చిత్తూరు – 12874
  • కడప – 10160
  • నెల్లూరు – 9380
  • శ్రీకాకుళం – 8549
  • కృష్ణా – 8239
  • ప్రకాశం – 6541
  • విజయనగరం – 6228
  • ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 2461
  • విదేశాల నుంచి వచ్చిన వారు: 434

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eight =