కరోనా చికిత్సకు అధిక బిల్లులు వసూలు, ఆసుపత్రి అనుమతి రద్దు

Corona Treatment, Corona Treatment In Hyderabad, Corona Treatment in Private Hospitals, Coronavirus, Prices For Corona Treatment in Private Hospitals, Private Hospital in Hyderabad, Telangana Govt, Telangana Govt Revokes Corona Treatment Permission

కరోనా చికిత్సలో భాగంగా పలు ప్రైవేట్ ఆసుపత్రులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా బాధితుల నుంచి నిబంధనలు పాటించకుండా ఎక్కువగా డబ్బు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇటీవలే అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న సోమాజిగూడలోని డెక్కన్ ఆస్పత్రికి కరోనా చికిత్స అందించే అనుమతిని ప్రభుత్వం రద్దు చేసింది. విచారణ అనంతరం ఆ ఆస్పత్రికి కరోనాకు చికిత్స అందించే అనుమతి రద్దు చేయడమే కాకుండా, ఇకనుంచి కొత్త కరోనా కేసులను చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆసుపత్రిలో ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్న వారి నుంచి కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే వసూలు చేయాలని సూచించారు. ఈ మేరకు ఆగస్టు 3, సోమవారం సాయంత్రం డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 14 =