కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమ‌ల‌కు అనుమ‌తి : టీటీడీ

Covid Vaccination or Covid-19 Negative Certificate Mandatory for Darshan at Tirumala - TTD

తిరుమల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కోరింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదివ‌ర‌కే టీటీడీ ఈ విష‌యాన్ని తెలియ‌జేసిందని, కానీ కొంతమంది భ‌క్తులు నెగెటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌డంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద నిఘా మరియు భద్రతా సిబ్బంది త‌నిఖీ చేసి అటువంటి వారిని వెన‌క్కు పంపాల్సి వస్తోందన్నారు. దీనివ‌ల‌న అనేకమంది భ‌క్తులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్-19 మూడ‌వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో హెచ్చ‌రిక‌లు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో ఖ‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికేట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద చూపించిన వారిని మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తారని తెలిపారు. కావున భక్తులు, ఉద్యోగుల మరియు వేలాది మంది సహ భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటి సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని భక్తులను టీటీడీ కోరింది. అలాగే టీటీడీకి సంబంధించిన ఇత‌ర ఆల‌యాల్లో కూడా ఈ కోవిడ్ నిబంధ‌న‌లు విధిగా పాటించాల‌ని భ‌క్తులకు టీటీడీ సూచించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =