తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

AP Breaking News, AP Political Updates 2019, Bus Accident In East Godavari, Bus Accident In East Godavari District, Bus Fell Into Valley In East Godavari District, Eight Dead After Tourist Bus Falls Into Valley In East Godavari, Eight Dead After Tourist Bus Falls Into Valley In East Godavari District, latest breaking news, Mango News Telugu, Tourist Bus Falls Into Valley In East Godavari District

తూర్పుగోదావరి జిల్లాలో అక్టోబర్ 15, మంగళవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేట్ పర్యాటక బస్సు ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డులో వాలీ-సుగ్రీవుల కొండ వద్ద బస్సు అదుపుతప్పి సుమారు 20 అడుగుల పైనుంచి లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. సమాచారం తెలుసుకున్న వెంటనే అధి​కారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భద్రాచలం నుంచి అన్నవరానికి బయలుదేరిన ఈ బస్సు, మారేడుమిల్లి చేరుకున్న కొద్దిసేపటికే ప్రమాదానికి గురైనట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్నవారంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. అతివేగం కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్టుగా భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏలూరు రేంజ్‌ డీఐజీ ఏఎన్‌ ఖాన్‌, సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా తూర్పుగోదావరి జిల్లా రూరల్‌ ఎస్పీని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here