జనసేన పార్టీకి మంచి రోజులొచ్చినట్లేనని కామెంట్

Jana Sena Counter To Pothina Mahesh, Jana Sena Counter, Jana Sena, Pothina Mahesh, Bolishetti Satyanarayana, Kiran Royal, Pawan Kalyan, Janasena Party, Vijayawada West, Sujana Chaudhary, TDP, BJP, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Jana Sena, Pothina Mahesh,Bolishetti Satyanarayana, Kiran Royal, Pawan Kalyan, Janasena Party, Vijayawada West, Sujana Chaudhary, TDP, BJP

విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కకపోవడంతో  జనసేన పార్టీని వీడిన పోతిన మహేష్..అధినేతపై ఎవరూ ఊహించని విధంగా  ఆరోపణలు చేశారు.  2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి  పోటీ చేసి ఓడిపోయిన మహేష్ .. ఈసారి కూడా తనకే టికెట్ అన్న నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈసారి ఎన్డీయే పొత్తులో భాగంగా మహేష్ టికెట్ ఇవ్వకుండా బీజేపీ అభ్యర్థి అయిన సుజనా చౌదరికి సీటు వచ్చింది. దీంతో పార్టీకి రాజీనామా చేసిన పోతిన.. జనసేన పార్టీతో పాటు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. దీంతో  జనసేన పార్టీ నేతలు పోతిన మహేష్ తీరును తప్పుపడుతున్నారు.

పోతిన మహేష్ రాజీనామాపైన, ఆయన చేసిన కామెంట్లపై జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి పోతిన పోవడం వల్ల మంచి రోజులు వచ్చాయని అన్నారు.  నిజానికి మహేష్ గారిపై జనసైనికులు, వీరమహిళలు, ప్రజలు నుంచి చాలా  ఫిర్యాదులు వచ్చాయని.., ఎదుగుతున్న బీసీ నాయకుడు కదా మారతాడని తమతో పాటు కళ్యాణ్ గారు ఓపిక పట్టారని తెలిపారు.  ఆయన వైసీపీతో కుమ్మక్కైన విషయం తమకు  తెలుసని అన్నారు

విజయవాడలోని ఓ బ్రాహ్మణుడి స్థలం కబ్జా విషయంలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి పోతిన మహేష్ వత్తాసు పలికినప్పుడే ఈయనపై చర్యలు తీసుకోవాల్సిందేమోనని బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సుజనా చౌదరి గారైనా, విజయవాడ పశ్చిమ సీటుకు ఎవరు వచ్చినా మహేష్‌కు డబ్బులివ్వాలా.. ఇలా ఎంతకాలం రాజకీయాలు చేస్తారంటూ బొలిశెట్టి సత్యనారాయణ ప్రశ్నించారు. జనసేనలో పోతిన పోకతో ఇలాంటి రాజకీయాలకు తెరపడుతుందని అన్నారు.

మరోవైపు పోతిన మహేశ్ కు తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్  తిరుపతిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి తాను పని చేస్తున్నానని చెప్పిన కిరణ్ రాయల్..మహేష్ లాగే తాను కూడా  తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా రాలేదని గుర్తు చేశారు. అయినా  మహేష్ లాగా ఎవరినీ విమర్శించలేదని నిజమైన జనసైనికుడు ఎవరైనా అలాగే చేస్తారని అన్నారు. నచ్చకపోతే పార్టీ మారిపోవాలి కానీ ఇలా  మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఇన్నాళ్లలో ఎప్పుడూ స్క్రిప్ట్ చూసి మాట్లాడని  పోతిన మహేష్.. వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ ను  చూసి మహేశ్ చదివారని ఎద్దేవా చేశారు. ఇష్టారీతిన మాట్లాడిన మహేష్ పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్పాలని లేకపోతే తామంతా ఊరుకోమని హెచ్చరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =