ఎన్నికల ముందు పవన్‌ ‘మెగా’ ప్లాన్‌.. డొనేషన్‌ అందుకేనా?

Pawan's 'Mega' Plan Before The Elections.., Mega Plan, Mega Plan Before The Elections, Pawan Mega Plan, Pawan Kalayan, Chiranjeevi Donation, Janasena Party, Elections Of AP State, Chiranjeevi, Pawan kalyan, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
pawan kalayan , Chiranjeevi donation , Janasena party , elections of AP state

మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయాలకు దూరమై ఏళ్లు గడుస్తున్నాయి. ఆయన ప్రత్యేక్ష రాజకీయాలు కాదు కదా.. పరోక్ష రాజకీయాలు కూడా చేయడం లేదు. తన సినిమాలేవో తాను చేసుకుపోతున్నారు. సందర్భానుసారంగా అప్పుడప్పుడు పొలిటికల్ లీడర్స్‌కు పరోక్ష చురకలంటిస్తున్నారు కానీ అది కూడా పూర్తి స్థాయిలో కాదు. అయితే ఆయన ఎక్కడా కూడా పవన్‌ను ఉద్దేశించి ఒక్కసారి కూడా నెగిటివ్‌గా మాట్లాడలేదు. అలాగని డైరక్ట్‌గానూ సపోర్ట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడా సీన్ మారింది. సరిగ్గా ఎన్నికల ముందు చిరంజీవి పవన్‌కు సాయం చేశారు.

సినిమా షూటింగ్‌లో కలిసిన మెగా బ్రదర్స్:

ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఏపీలో మే 13న జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ  అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ శివార్లలో ఉన్న పోచంపల్లిలోని ఓ సినిమా షూటింగ్ లొకేషన్ లో తన అన్నను కలిశారు. చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా షూటింగ్ స్పాట్ కు వెళ్లారు. అక్కడికి చేరుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ చిరంజీవి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ముగ్గురూ ముచ్చటించారట.

‘చిరు’ సందేశమిదేనా?

ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు పార్టీ విరాళంగా ఇచ్చిన రూ.5 కోట్ల చెక్కును చిరంజీవి పవన్ కల్యాణ్ కు అందజేసినట్లు జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రెస్ నోట్ లో పేర్కొంది. జనసేన ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ తన అన్న ఆశీస్సులు కోరారు. ఈ కీలక సమయంలో పవన్ కళ్యాణ్ కు తన నైతిక మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని చిరంజీవి హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో చిరంజీవి జనసేన పార్టీకి బాహాటంగా మద్దతు ఇస్తారా, పవన్ కళ్యాణ్ కు, కూటమికి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిస్తారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. పవర్ లేకపోయినా పవన్ కళ్యాణ్ కష్టపడి సంపాదించిన డబ్బును వ్యవసాయ కూలీల కోసం ఖర్చు చేస్తున్న తీరు తనకు చాలా సంతోషంగా ఉందని మెగాస్టార్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. అందుకే పవన్ కళ్యాణ్ తన లక్ష్యసాధనకు తోడ్పడాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీకి విరాళం ఇచ్చానని చిరంజీవి తెలిపారు. దీనిబట్టి చూస్తే మెగా-పవర్‌ అభిమానులను చిరంజీవి మరోసారి ఏకతాటిపైకి తెచ్చినట్టుగా తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో మెగాస్టార్‌ అభిమానులు తమ్ముడు పవన్‌కు సపోర్ట్‌ ఇవ్వాలని చిరంజీవి చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 15 =