ఆ పార్టీ విజయంపై ప్రభావం చూపుతాయా?

Differences With The Selection Of Candidates.., Differences Of Candidates, Selection Of Candidates, Srikakulam Politics, Head Ache For Ram Mohan Naidu, Ram Mohan Naidu, Srikakulam Ram Mohan Naidu, Srikakulam News, Srikakulam Seat, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Differences With The Selection Of Candidates.., Differences Of Candidates, Selection Of Candidates, Srikakulam Politics, Head Ache For Ram Mohan Naidu, Ram Mohan Naidu, Srikakulam Ram Mohan Naidu, Srikakulam News, Srikakulam Seat, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu

మూడు పార్టీలు కలిస్తే ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరదా అంటే కచ్చితంగా కుదురుతుంది. అయితే పార్టీ పెద్దల మధ్య కుదిరే ఒప్పందాలు వేరు.. గ్రౌండ్‌ లెవల్లో రియాలిటి వేరు. కార్యకర్తలను, కీలక నేతల మధ్య గొడవలను పరిష్కరించడం ఏ మాత్రం చిన్న విషయం కాదు. చివరి నిమిషంలో పెట్టుకునే పొత్తులు చేసే రచ్చ అంతాఇంతా కాదు. ఐదేళ్లు ఎంతో ఖర్చు చేసిన నేతలకు చివరి నిమిషంలో సీటు రాకపోతే ఆ బాధ తట్టుకోలేరు. ఏపీలో చాలా చోట్ల అదే జరుగుతోంది. శ్రీకాకుళంలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది.

రామ్మోహన్ నాయుడు విజయావకాశాలపై దెబ్బ పడుతుందా?

శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి టీడీపీ తన అభ్యర్థిని గోండు శంకర్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. అభ్యర్థి ప్రకటన వెలువడిన వెంటనే మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమ అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. తాము స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామన్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులు గొండు శంకర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయావకాశాలను దెబ్బతీస్తామని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ 6,653 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారని, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో 10 వేలకు పైగా ఓట్లు చీలిపోయే అవకాశం ఉందన్నారు.

ఇక్కడ కూడా అసంతృప్తే?

మరోవైపు పాతపట్నం అసెంబ్లీ స్థానానికి టీడీపీ తన అభ్యర్థిని వ్యాపారి మామిడి గోవిందరావుగా ప్రకటించింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. టీడీపీ ఓట్లను చీల్చి ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయావకాశాలను దెబ్బతీస్తామని హెచ్చరించారు. మరోవైపు టీడీపీ సీనియర్ నేత, టీడీపీ సీనియర్ నేత కిమిడి కళావెంకటరావుకు ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ నిరాకరించడం, ఆయనను కూడా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చడంపై కాపు సామాజికవర్గం నాయకులు, ఓటర్లు మండిపడుతున్నారు. శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + eight =