ఈసారి నాతో సహా నిలబడే అభ్యర్థులంతా అసెంబ్లీలో ఉంటారు – జనసేన పదో ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌

Janasena Chief Pawan Kalyan Gives Aggressive Speech in Party's 10th Formation Day at Machilipatnam,Janasena Chief Pawan Kalyan,Pawan Kalyan Gives Aggressive Speech,Janasena Party 10th Formation Day,Formation Day at Machilipatnam,Mango News,Mango News Telugu,pawan kalyan full speech,JanaSena Party Formation Day Meeting,Pawan Kalyan Public Meeting Live,Pawan Kalyan Full Speech at Machilipatnam,Pawan Kalyan on Varahi Vehicle,AP Politics,AP Latest Political News,Andhra Pradesh News and Live Updates,Janasena Formation Day Latest Updates,Jana Sena Foundation Day Celebration

ఈసారి నాతో సహా నిలబడే అభ్యర్థులంతా అసెంబ్లీలో ఉంటారని, వచ్చే ఎన్నికల్లో మా ఓటు వృథా కానివ్వం, సత్తా చాటుతామని స్పష్టం చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఆయన మంగళవారం మచిలీపట్నంలోని సుల్తాన్‌ నగరంలో జరిగిన జనసేన పదో ఆవిర్భావ సభలో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఏపీలోని అన్ని కులాల మధ్య ఐక్యత, కాపులు కీలక భూమిక పోషించాల్సిన అవసరం, టీడీపీతో పొత్తు తదితర అంశాలను ప్రస్తావించారు. ఇక ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోదని, ప్రయోగాలు చేయబోమని, అసెంబ్లీలో అడుగుపెట్టేలాగే తమ వ్యూహం ఉంటుందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమాచారం తెప్పించుకుని, జనసేన గెలుస్తుందని విశ్వాసం కలిగితే ఒంటరిగా పోటీ చేయడానికి సైతం వెనుకాడనని తేల్చి చెప్పారు.

ఇక ఒకప్పుడు తాము వేసుకున్న ప్రణాళికను అమలు చేసి ఉంటే ఇప్పుడు టీడీపీతో అవసరంలేని స్థాయికి జనసేన ఎదిగేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే దీనికంతటికీ కారణం.. రాష్ట్ర బీజేపీ నాయకులేనని, వారి వైఖరి వల్లే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని టీడీపీతో కలిసి పోరాటం చేస్తానని చెప్పాల్సి వచ్చిందని అన్నారు. అంతే కానీ, తనకు టీడీపీ మీద ప్రత్యేక ప్రేమ ఏమీ లేదని, అలాగే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద ఆరాధనా భావం కూడా లేదని స్పష్టం చేశారు. అయితే తనకు చంద్రబాబు అంటే గౌరవముందని, ముఖ్యమంత్రిగా ఆయన సమర్థుడని పవన్‌ పేర్కొన్నారు. దేశానికి ఒక బలమైన నాయకుడు కావాలన్న ఉద్దేశంతోనే నరేంద్ర మోదీ సారథ్యం లోని బీజేపీకి మద్దతు ఇచ్చానని, అయితే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని తాను భావిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మారాలంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఉందని, కాపులంతా ఐక్యంగా ఉంటే… మిగిలిన కులాల వారూ వెంట నడుస్తారని పవన్‌ ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వం కులాలను విడదీసే కుట్రలు పన్నుతోందని విమర్శించిన ఆయన, తాము మాత్రం అన్ని కులాలు ఐక్యంగా ఉండాలని బలంగా కోరుకుంటున్నామని తెలిపారు. ఇక కులాల కాష్టం నుంచి ప్రజలు బయటకు రావాలని, కాపుల ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా చేసుకుంది ఓ కమ్మవారి ఆడపడుచునని గుర్తు చేశారు. ఒక్క కులాన్ని నమ్ముకుని సమాజాన్ని నడపలేమని, ఒకరిపై ఒకరు పరస్పరం ఆధారపడి ఉన్నామని, చదువుకున్నవారు ఓటును అమ్ముకోవద్దని పిలుపునిచ్చారు. కాగా వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయాలని వైసీపీ అంటోందని, ఆ పార్టీ కోరుకునేది జరగనివ్వనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − five =