రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియపై సీఎస్ శాంతి కుమారి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

CS Santhi Kumari held Review Meeting with Officials on Job Recruitments Process in The State,CS Santhi Kumari,CS Santhi Kumari held Review Meeting,CS Santhi Kumari with Officials on Job Recruitments,Job Recruitments Process in The State,Mango News,Mango News Telugu,Special Dashboard to Report Recruitment Progress,CS review on recruitment,CS holds meet with recruitment boards,Chief Secretary Directs Officials,Speed ​​up Job Placement,CS Santhi Kumari Latest News and Updates,Telangana Job Recruitments Process Latest News

రాష్ట్రంలో జరుగుతున్న వివిధ శాఖల ఉద్యోగ నియామకాల పురోగతిని తెలిపేందుకు ప్రత్యేకంగా డాష్ బోర్డు ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల ప్రక్రియపై బి.ఆర్.కే.ఆర్ భవన్ లో సీఎస్ శాంతి కుమారి మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శులు టికే శ్రీదేవి, రోనాల్డ్ రోస్, హెచ్‌ఆర్‌ఎం అండ్ సర్వీసెస్ సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస రావు, యూనివర్సిటీ కామన్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఇప్పటివరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా 17,285 ఉద్యోగాలకు సంబంధించి 17 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి, కొన్ని నోటిఫికేషన్లకు ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తి చేశామని అధికారులు వివరించారన్నారు. గ్రూప్ 2 ,3 ,4 నోటిఫికేషన్లకు సంబంధించి జూలై మాసాంతంలోగా రాత పరీక్షలు పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారని, నవంబర్ మాసాంతం వరకు పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా భర్తీ కానున్న అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి రాత పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,516 పోస్టులకు నోటిఫికేషన్ జారి చేయగా ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పోర్ట్ చేశామని, ఏప్రిల్ లో రాత పరీక్షలు పూర్తి చేసి, సెప్టెంబర్ మాసంలోగా నియామకాలు జరుపుతామని పేర్కొన్నారు.

మెడికల్, హెల్త్ సర్వీస్ బోర్డు ద్వారా ఆగస్టులోగా దాదాపు పది వేల వివిధ స్థాయి ఉద్యోగ ఖాళీలను నింపనున్నట్టు సీఎస్ తెలిపారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా కూడా మొత్తం పది వేల పోస్టులకు సెప్టెంబర్ మాసంలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు శాంతి కుమారి స్పష్టం చేశారు. ఉద్యోగాల నియమాకాల ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు తీసుకొని సర్వీసు అంశాలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల అంశాల్లో కొన్ని శాఖలలో పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించి ఆయా ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేయాలని సీఎస్ శాంతి కుమారి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 7 =