డిసెంబర్ 2న నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan to Tour Nivar Cyclone Affected Areas on December 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలలో నివర్ తుఫాన్ ప్రభావం చూపిన నేపథ్యంలో నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. డిసెంబర్ 2వ తేదీన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ముందుగా నివర్ తుపాను ప్రభావిత జిల్లాలైన చిత్తూరు, నెల్లూరు, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల జనసేన నాయకులతో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. తుఫాన్ వలన జరిగిన నష్టం, రైతాంగం పడుతున్న ఇబ్బందులను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం దాదాపు 12 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని, వరి, పత్తి, మిరప, పొగాకు, వేరుశనగ, అరటి, పండ్లతోటలు, ఉద్యానవన పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే వీటితో పాటుగా పశుసంపదను కూడా రైతులు కోల్పోవడం దురదుష్టకరమని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతాంగాన్ని పరామర్శించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + seven =