రూట్ మార్చిన జనసేనాని..

Janasena Who Changed The Route Till Now It Was White And White But Now,Janasena Party Chief Pawan Kalyan, Janasena Party Founder, Mango News, Mango News Telugu, Pawan Kalyan Latest News And Updates, Pawan Kalyan News And Live Updates, Power Star Pawan Kalyan, PSPK,TDP Janasena Alliance,Pawan Kalyan Announces JSP TDP Alliance,Janasena Chief Pawan Kalyan,Pawan Kalyan Confirms Jana Sena TDP Alliance,Pawan Kalyan TDP Janasena Alliance,Janasena Party

ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ పవన్ ఓ సంచలనమే. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయినా.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క సీటు గెలుచుకున్నా పవన్ చరిష్మా ఏ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే.. రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఓటమిని కూడా ప్రజలకే వదిలేసిన రాజకీయ విజ్ఞత గల లీడర్‌గా నిలిచిపోయారు. ఏ ప్రజల కోసం తాను పోరాడతా అంటున్నానో.. ఆ ప్రజలే నన్ను ఓడించారన్న ఆవేదన కనిపించిందేమో కానీ.. ఏనాడూ ఆ అక్కసును తీర్చుకోలేదు. పైగా అప్పటి నుంచి కష్టం వచ్చినా.. కన్నీళ్లు వచ్చినా నేనున్నానంటూ అండగా నిలిచిన తీరు ప్రత్యర్థుల గుండెల్లో వణుకును పుట్టిస్తుంటే.. అయ్యో ఇలాంటి వ్యక్తికా తాము ఓటు వేయలేదన్న పశ్చాత్తాపం ప్రజల్లో పెరిగిపోయేలా చేసింది. రైతన్నలకు సాయంగా తన వ్యక్తిగత డబ్బులను రూ.30 కోట్లకు పైగా పంచిన మనసున్న నేతగా మరింతగా ఎదిగిపోయారు.

అందుకే పవన్ ఎక్కడకు వెళ్లినా జన ప్రభంజనం వెంటగా వస్తుంది. పవన్ మాట్లాడిన ఒక్కో మాట వేయి సునామీలు సృష్టిస్తుంది. ఆ భయమే వైసీపీ నేతలంతా ప్రెస్ మీట్లు పెట్టి మరీ పవన్‌పై మూకుమ్మడి దాడికి దిగేలా చేస్తుంది. కాకపోతే జనసేన ఒక్కటే బరిలో దిగితే సరైన గుర్తింపు లేని నాయకుల వల్ల అనుకున్న సీట్లు గెలవలేరన్న లెక్కలతోనే పదేపదే పవన్ దమ్ముంటే ఒంటరిగా పోటీకి రా ఒంటరిగా పోటీకి రా అని అధికార పక్షం నేతలంతా రెచ్చగొట్టడం దీనిలో భాగమే. అయినా మొన్న చంద్రబాబుతో ములాఖత్ తర్వాత టీడీపీతోనే జనసేన కలిసి వెళ్తుందని క్లారిటీ ఇవ్వడంతో ఆ నేతలకు ఇప్పటి నుంచే గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

దీనికి తగ్గట్లే చంద్రబాబు అరెస్టుతో పవన్ కళ్యాణ్ కూడా మరింత దూకుడు పెంచి ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మళ్లీ షూటింగ్స్‌ కి బ్రేక్ ఇచ్చి మరీ రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. అయితే రీసెంట్‌గో పవన్ డ్రస్సింగ్ విషయంలో వచ్చిన మార్పు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పొలిటికల్ విషయాలకు సంబంధించిన ఏ సందర్భంలో అయినా వైట్ అండ్ వైట్ ఖద్దరు డ్రెస్‌లోనే ఎక్కువగా కనిపిస్తూ వచ్చేవారు. మరీ ఎప్పుడో ఒకప్పుడు మాత్రం రెడ్ కలర్ ఖద్దరు డ్రెస్‌లో కనిపించేవారు. చాలా వరకు రాజకీయాలకు సంబంధించిన మీటింగ్స్, ప్రెస్ మీట్స్ కి ఖద్దరు, వైట్ అండ్ వైట్ డ్రెస్ లోనే వచ్చేవాళ్ళు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కొన్ని సినిమా ఈవెంట్స్ కి కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లోనే రాజకీయ నాయకుడిలా వచ్చారు.

కానీ కొద్ది రోజుల నుంచి పవన్ తన స్టైల్ మార్చేశారు. చివరకు చంద్రబాబుని జైల్లో కలవడానికి వెళ్లినప్పుడు కూడా బ్లూ జీన్స్, బ్లూ షర్ట్ వేసుకుని వెళ్లారు. ఇక మొన్న మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలోనూ.. పవన్ బ్లాక్ అండ్ బ్లాక్ జీన్స్, షర్ట్ వేసుకొచ్చారు. అలాగే తాజాగా ఓ ప్రెస్ మీట్‌కు హాజరయిన పవన్ అక్కడకు కూడా నార్మల్ వైట్ షర్ట్ తో బ్లూ జీన్స్ వేసుకొచ్చారు. దీంతో పవన్ డ్రెస్సింగ్ స్టైల్‌పై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. ఇన్నాళ్లు సినిమాల ఫంక్లన్లకు కూడా వైట్ అండ్ వైట్ ఖద్దరు వేసుకెళ్లిన పవన్.. ఇప్పుడేంటి రాజకీయాలకు కూడా ఇలా జీన్స్, కలర్ షర్టులు వేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.ఏది ఏమయినా ఇలా పవన్ సడెన్ గా డ్రెస్సింగ్ స్టైల్ మార్చడంతో మరోసారి జనసేనాని ట్రెండ్ అవుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here