జగనన్నఅమ్మఒడి రెండో విడత జనవరి 9 న ప్రారంభం

Minister Adimulapu Suresh Says Amma Vodi Second Phase Payment will Deposit on Jan 9th,Minister Adimulapu Suresh,Adimulapu Suresh Press Meet Live,Jagananna Amma Vodi,Jagananna Amma Vodi Scheme,AP News,AP Education Minister Adimulapu Suresh Press Meet,Minister Adimulapu Suresh Press Meet,Adimulapu Suresh Press Meet,AP Minister Adimulapu Suresh Press Meet,AP Education Minister Adimulapu Suresh,Adimulapu Suresh,AP Minister Adimulapu Suresh,Ys Jagan Live,Ys Jagan Speech Live,AP Politics,Ys Jagan Speech,Jagananna Amma Vodi Latest News,Minister Adimulapu Suresh,Vijayawada,Amma Vodi List,Education Minister Audimulapu Suresh,Mango News,Mango News Telugu

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల చదువు భారం కాకూడదని, పేద తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత జనవరి 9 న “జగనన్న అమ్మఒడి” పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలను బడికి పంపుతున్న ప్రతి తల్లికి ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలు అందజేయనున్నారు. అందులో భాగంగా వచ్చే జనవరి 9న జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత సాయాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సోమవారం నాడు వెల్లడించారు.

అమ్మఒడి పథకం ద్వారా లబ్ది పొందేందుకు డిసెంబర్ 10 వ తేదీనుంచి నుంచి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇచ్చినట్టు పేర్కొన్నారు. లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను 16 నుంచి 19 వ తేదీ మధ్యలో విడుదల చేస్తామన్నారు. ఇక 20 నుంచి 24 వ తేదీల మధ్యలో ఆ జాబితాలో తప్పుల సవరణకు అవకాశం ఇస్తామని, అమ్మఒడి లబ్ధిదారుల తుది జాబితాను డిసెంబర్ 26 వ తేదీన విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. 2020 సంవత్సరానికి గానూ అమ్మ ఒడి పథకం కింద 43.54 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,336 కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =