నవంబరు 7 నుండి పాపికొండలు బోటు విహార యాత్ర – మంత్రి అవంతి శ్రీనివాస్

Andhra Pradesh Tourism department, Avanthi Srinivas Announces that Papikondalu Boat Trips to Start, Boat Trips To Papikondalu in Andhra Pradesh, Boat Trips To Papikondalu in Andhra Pradesh To Restart, Mango News, Minister Avanthi Srinivas, Minister Avanthi Srinivas Announces that Papikondalu Boat Trips to Start from November 7, papikondalu, Papikondalu Boat Trip, Papikondalu Boat Trips, Papikondalu Boat Trips to Start from November 7, Papikondalu Excursion, papikondalu tour

పాపికొండల్లో నవంబరు 7వ తేదీ నుండి పర్యాటక బోటు విహార కార్యక్రమాలను ప్రారంభించనున్నట్టు ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం సచివాలయంలోని మూడవ బ్లాకులో బోటు ఆపరేటర్లతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధితో పాటు పర్యాటకుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని స్పష్టం చేశారు. రాజమండ్రి నుండి పాపికొండల వరకు పర్యాటక బోటు టిక్కెట్ ధరను రవాణా, భోజన వసతి సహా మనిషికి రూ.1250 ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. బోటు ఆపరేటర్లు బోటులు నిర్వహణ ద్వారా వారి జీవనోపాధిని పొందడంతోపాటు పర్యాటకుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు. అదే విధంగా బోటుల నిర్వహణపై ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని మంత్రి స్పష్టం చేశారు. గోదావరి నదిలో 28మీటర్ల లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే పర్యాటక బోట్లను అనుమతిస్తున్నారని, దానిని 30 మీటర్ల వరకూ పెంచాలని నీటిపారుదల శాఖను కోరునున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

దేశంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు పర్యాటక రంగంతోనే బాగా అభివృద్ధి చెందాయని అదే తరహాలో రాష్ట్రాన్ని కూడా పర్యాటక పరంగా అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ఒక ప్రముఖ పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గత ఏడాది గోదావరి నదిలో పాపికొండలు వద్ద జరిగిన బోటు ప్రమాదం అత్యంత దురదృష్టకరమైన సంఘటనని అలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. బోటు ఆపరేటర్లతో వెంటనే ఒక వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేయాలని దానివల్ల సకాలంలో వారికి సమాచారాన్ని అందించేందుకు వీలవుతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 20 =