మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్ రత్న అవార్డు కోసం 11 మందిని ప్రతిపాదించిన సెలక్షన్‌ కమిటీ

11 Recommended for Major Dhyan Chand Khel Ratna, Dhyan Chand Khel Ratna Award, Khel Ratna award recommended for 11 athletes, Lovlina Borgohain, Major Dhyan Chand Khel Ratna, Major Dhyan Chand Khel Ratna Award, Mango News, Mithali Raj, Mithali Raj and Sunil Chhetri Among 11 Recommended for Major Dhyan Chand Khel Ratna, Mithali Raj Recommended for Major Dhyan Chand Khel Ratna, Neeraj Chopra, Neeraj Chopra Recommended for Major Dhyan Chand Khel Ratna, Sunil Chhetri

జాతీయ క్రీడా పురస్కారాలు-2021 లో భాగంగా మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచర్య, ధ్యాన్ చంద్ సహా పలు అవార్డుల కోసం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం అయిన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న కోసం ఈసారి 11 మందిని ప్రతిపాదిస్తూ సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఖేల్‌రత్నకు ప్రతిపాదించబడిన వారిలో క్రికెట్ నుంచి మిథాలీ రాజ్, ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి, టోక్యో ఒలింపిక్స్‌ పతక విజేతలు నీరజ్ చోప్రా (జావెలిన్‌), రవి దహియా (రెజ్లింగ్), పీఆర్ శ్రీజేష్ (హాకీ), లవ్లినా బోర్గోహైన్ (బాక్సింగ్), టోక్యో పారాలింపిక్స్ పతక విజేతలు ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్), సుమిత్ ఆంటిల్ (జావెలిన్), అవని ​​లేఖరా (పారాలింపియన్), కృష్ణా నగర్ (బ్యాడ్మింటన్), మనీశ్‌ నర్వాల్ (షూటింగ్) ఉన్నారు.

సెలక్షన్‌ కమిటీ ప్రతిపాదించిన ఈ జాబితాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదముద్ర వేయడమే ఇక మిగిలింది. అలాగే భారత్ క్రికెట్ జట్టు సీనియర్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ సహా మరో 35 మందికి అర్జున అవార్డు కోసం సెలక్షన్‌ కమిటీ సిఫారసు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here