ఏపీలో మౌలిక సదుపాయాలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్‌ ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ

Minister Botsa Satyanarayana Responds Over KTR Comments on Facilities in AP, Botsa Satyanarayana Responds Over KTR Comments on Facilities in AP, KTR Comments on Facilities in AP, Minister Botsa Satyanarayana counters KTR over his remarks on AP development, Minister Botsa Satyanarayana Responds Over KTR Comments, Minister Botsa Satyanarayana, education minister of ap, Botsa Satyanarayana, Botsa Satyanarayana Minister for Education, KTR Intresting Comments On AP, KTR Sensational Comments On AP, KTR Comments On AP, KTR Comments, AP development, Mango News, Mango News Telugu,

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈరోజు ఉదయం ఏపీలో మౌలిక సదుపాయాలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో కరెంటు, నీళ్లు, రోడ్లు లాంటి కనీస వసతులు ఏమీ సరిగా లేవని ఒక స్నేహితుడు తనతో చెప్పారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్‌ ఇచ్చారు. విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌ సిటీలోనే కరెంట్‌ లేదని, ఇది నాకు వేరెవరో చెప్పింది కాదని, తాను స్వయంగా చూశానని పేర్కొన్నారు. నిన్న‌టి వరకు హైద‌రాబాద్‌లోనే ఉన్నానని, అక్కడ ఇంట్లో కరెంటు లేక జనరేటర్‌ వేసుకోవాల్సి వచ్చిందని, కానీ ఈ విషయాన్నీ నేనెవరికీ చెప్పలేదని తెలిపారు. బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న వ్యక్తులు ఎలా పడితే అలా మాట్లాడటం కరెక్ట్‌ కాదని చెప్పారు. కేటీఆర్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వస్తే తమ ప్రభుత్వం వేసిన కొత్త రోడ్లను చూపిస్తానని పేర్కొన్నారు. తమ అభివృద్ధి గురించి చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ దానికోసం పక్క రాష్ట్రాల స్థితిగతులపై వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పారు. మంత్రి బొత్సతో పాటు ఇతర మంత్రులు కూడా కేటీఆర్‌ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here