మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్, అంబటి రాంబాబులకు భద్రత పెంపు

AP Govt Increases Security for Minister Kodali Nani, AP Govt Increases Security for Minister Kodali Nani and other 3 MLAs, AP Minister Kodali Nani, AP News, Ap Political News, Mango News, Security cover to minister Kodali Nani, Security cover to minister Kodali Nani and three MLAs, Security enhanced for Kodali and 3 other YSRC MLAs, Security for Minister Kodali Nani, Security for Minister Kodali Nani and other 3 MLAs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సహా ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలకు భద్రతను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల శాసనసభలో జరిగిన పరిణామాల అనంతరం వస్తున్న బెదిరింపులు దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మంత్రి కొడాలి నానికి ప్రస్తుతం ఉన్న భద్రతతో పాటు అదనంగా 4+4 గన్ మెన్ల (వ్యక్తిగత భద్రతా అధికారి) భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. దీంతో మంత్రి కొడాలి నాని మొత్తం భద్రతా సిబ్బంది సంఖ్య 17కు చేరుకుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలకు ప్రస్తుతం ఉన్న 1+1 గన్ మెన్ల భద్రతను, 4+4 గన్ మెన్ల భద్రతగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను సంబంధిత అధికారులు తక్షణమే అమలయ్యేలా చూడాలని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =