టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రపై స్పందించిన మంత్రి ఆర్కే రోజా, కీలక వ్యాఖ్యలు

Minister RK Roja Responds Over TDP National General Secretary Nara Lokesh Yuva Galam Padayatra,Minister RK Roja Responds,Over TDP National General Secretary,TDP National General Secretary Nara Lokesh,Nara Lokesh Yuva Galam Padayatra,Nara Lokesh,Yuva Galam Padayatra,Mango News,Mango News Telugu,Nara Lokesh Age,Nara Lokesh Twitter,Nara Lokesh Son,Nara Lokesh Padayatra,Nara Lokesh Myneta,Nara Lokesh Father,Nara Lokesh Family,Nara Lokesh,Nara Lokesh Latest News,Nara Lokesh Latest News And Updates,Nara Lokesh Latest Updates,Nara Lokesh Padayatra Latest News and Updates

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టనున్న పాదయాత్రపై ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేయడానికే నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. బుధవారం ఆమె వెరిటాస్ సైనిక్ స్కూల్ మూడవ వార్శికోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను తిట్టడానికే లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర మొదలుపెడుతున్నారని, అయినా అది యువ గళం కాదు టీడీపీకి సర్వ మంగళం అని అభివర్ణించారు. ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చని తెలిపిన ఆమె దశ దిశ లేకుండా ప్రజలకు ఏం చేశారో చెప్పలేని వాళ్ళు పాదయాత్రలో ఏం చెప్తారు? అని ప్రశ్నించారు.

ఇక ప్రజా సమస్యలపై పోరాటం కోసం నాడు జగన్ పాదయాత్ర చేశారని, అలాగే అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో చెప్పిన హామీలలో 99శాతం అమలు చేశారని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో కోలీవుడ్ పరిశ్రమకు భూములు కేటాయిస్తే స్వాగతిస్తామని, ఎందుకంటే దానివల్ల రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అలాగే ఇటీవల ఒక సినిమా వేడుకలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అక్కినేనిపై చేసిన వాఖ్యలను ఖండించారు. ఇలాంటి వాఖ్యలే ఎన్టీఆర్ పై చేస్తే ఎలా ఉంటుందో బాలకృష్ణ ఆలోచన చేయాలని కోరారు. అలాగే టీడీపీ హయాంలోనే మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందని, దీనికి నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here