పెద్దాపురం అభ్యర్థిగా బరిలోకి ఆ సీనియర్ నేత

Mudragada Padmanabham Into YCP In January, Mudragada Padmanabham YCP, YCP Mudragada Padmanabham, Mudragada Padmanabham Into YCP, Mudragada Padmanabham, YCP,Mudragada Padmanabham Contesting From Peddapuram, Peddapuram Mudragada Padmanabham, Latest Mudragada Padmanabham News, Latest YCP News, YCP News, AP News, Latest AP News, CM Jagan, AP CM, Mango News, Mango News Telugu
Mudragada Padmanabham into YCP, Mudragada Padmanabham, YCP,Mudragada Padmanabham contesting from Peddapuram

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం ఈ మధ్య మళ్లీ జోరందుకుంది. త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు ఓ రేంజ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే వైసీపీకి చెందిన ముఖ్య నేతలు ముద్రగడతో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభానికి  ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ ఇవ్వడానికి వైఎస్ జగన్ కూడా ఓకే చెప్పేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో  ఈ విషయంపై ముద్రగడకు వైసీపీ ప్రతిపాదనలు పంపినట్లు..దీనికి ఆ పెద్దాయన కూడా సై అన్నట్లుగా వార్తలు వినపిస్తున్నాయి. దీంతో వైసీపీలో ముద్రగడ పద్మనాభం చేరడానికి జనవరి 2న ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు  ముద్రగడ పద్మనాభం రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేయడానికి ఇష్టపడుతున్నట్లు  తెలుస్తోంది.  ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి కానీ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కానీ  బరిలో దిగాలని  ముద్రగడ  పద్మనాభం అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.  అయితే వైసీపీ అధిష్టానం మాత్రం..ఆ పెద్దాయనకు పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అటు ప్రస్తుత పెద్దాపురం ఇన్‌చార్జి అయిన దొరబాబుపై అధిష్టానం అంత సానుకూలంగా లేదని, దీనికి తోడు స్థానికంగా దొరబాబుపై వ్యతిరేకత పెరిగినట్లు కూడా అధిష్టానం గుర్తించింది. దీనికి తోడు దొరబాబు సొంతపార్టీలోని నేతలందరినీ కూడా  కలుపుకొనిపోవడంలో ఫెయిల్ అవుతున్నారని ప్రచారం ఉంది. అంతేకాదు ఐప్యాక్, ఇతర సర్వేలలో కూడా దొరబాబుకు ప్రతికూల సర్వేలు రావడంతో అక్కడ ముద్రగడ పద్మనాభంను బరిలోకి దించడానికి వైసీపీ సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన  వెలువడే వరకూ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

మరోవైపు ముద్రగడ పద్మనాభంకు వైఎస్ఆర్ ఫ్యామిలీతో మొదటినుంచీ విడదీయరాని అనుబంధం ఉంది. వైఎస్ఆర్  ఆకస్మిక మరణం తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్‌తో కూడా అదే అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అంతేకాకుండా కాపు ఉద్యమంలో రైలు దహనం కేసు ఎదుర్కొంటున్న కాపు యువతపై  ఉన్న కేసులను సీఎం జగన్ ఎత్తివేశారు.దీంతో  వైఎస్ జగన్‌ పట్ల ముద్రగడ పద్మనాభం ఆ కృతజ్ఞత భావంతోనే  ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక టీడీపీ  అధినేత చంద్రబాబు నాయుడు అంటేనే  ముద్రగడ పద్మనాభం మండిపడుతుంటారు. అందుకే ఎప్పుడు చూసినా చంద్రబాబుకు ముద్రగడకు మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనేలా వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అయితే  సొంత సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యా‌ణ్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీలో చేరడానికి ముద్రగడ ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. పైగా పవన్‌పై సెటైర్లు విసరడం ఎప్పటికప్పుడు ముందే ఉంటారన్న పేరు ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + seventeen =