గ్రామ,వార్డు సచివాలయాలపై కీలక నిర్ణయం, పీఎంయూ కాల్ సెంటర్‌ ఏర్పాటు

Andhra CM, Andhra Pradesh, Andhra Pradesh News, AP CM YS Jagan, AP CM YS Jagan Review Meeting, AP News, Jagan promises village secretariats, YS Jagan hold Review on Village and Ward Secretariats, YS Jagan Mohan Reddy

రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల కోసం పర్చుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్(పీఎంయూ) కాల్ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఆగస్టు 10, సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి ఈ కాల్ సెంటర్ ను ప్రారంభించించారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు ఎక్కడా ఆగినా పీఎంయూ అప్రమత్తం చేసి, నిర్దేశించిన సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూడనుంది. ముందుగా నాలుగు సర్వీసులును పీఎంయూ పర్యవేక్షించనుండగా, అక్టోబర్ నుంచి 543 కి పైగా సేవలను అమలు చేయనుంది.

అలాగే సామాజిక తనిఖీ మార్గదర్శకాలను కూడా సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. మారుమూల ప్రాంతాల్లో గల సచివాలయాలకు నెట్ సదుపాయాన్ని సీఎం‌ ప్రారంభించారు. ఇంటర్నెట్ సదుపాయం లేని 512 సచివాలయాలను అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే 213 సచివాలయాల్లో నెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేయగా, మిగిలిన సచివాలయాల్లో వచ్చే 2 నెలల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, గ్రామ,వార్డు సచివాలయాల్లో ఖాళీలకు సెప్టెంబరులోగా పరీక్షల నిర్వహించి, భర్తీ ప్రక్రియను ముగించాలని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన ఉండాలని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =