మెదక్ నుంచి రఘునందన్ రావు?

Etala Rajender From Malkajgiri Raghunandan Rao From Medak, Medak Raghunandan Rao, Malkajgiri Etala Rajender, Etala Rajender from Malkajgiri, Raghunandan Rao from Medak, Malkajgiri, Medak, Malkajgiri MP Seat, Medak MP Seat, MP Seat, MP, Telangana MP Seats, BJP MP Seat, BJP MP Candidates, BJP, Mango News, Mango News Telugu
Etala Rajender from Malkajgiri, Raghunandan Rao from Medak,

అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన బూస్టుతో బీజేపీ దూసుకుపోయే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో గతంలో కంటే మెరుగ్గా ఓటింగ్ నమోదుతో పాటు 8 స్ధానాలను కైవసం చేసుకోవడంతో పార్టీ వర్గాలు పార్లమెంట్ ఎన్నికలలోనూ తెలంగాణపైనే ఫోకస్ పెంచింది.  ఇప్పటి నుంచే లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

2019 లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు సీట్లు గెలుచుకుంది. దీంతో  రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో  ఎనిమిది నుంచి 12 సీట్లు గెలుచుకోవడానికి స్కెచ్ వేస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణకు  డిసెంబర్  27 లేదా 28 న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రానున్నారు.  మరోవైపు ఎంపీ  టికెట్ల కోసం పార్టీ పెద్దల చుట్టూ నేతలంతా చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

హైదరాబాద్‌లో ఎప్పటి నుంచో స్థిరపడిన నార్త్ ఇండియన్ భగవంతరావు.. హైదరాబాద్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఖమ్మం,మహబూబాబాద్ కోసం అధిష్టానం బలమైన అభ్యర్థుల్ని వెతికే పనిలో పడింది. అంతేకాకుండా పెద్దపల్లి, జహీరాబాద్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలపైన కూడా బీజేపీ అధిష్టానం  పోకస్ పెట్టింది.

కొన్ని పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తుంది.  దీని ప్రకారం మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, దిలీప్ ఆచారిలకు అవకాశం ఉండనుంది. చేవెళ్లనుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్ పేర్లు తెరమీదకు వచ్చాయి. ఇక మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్, చాడ సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ ఉన్నారు. ఇక సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు ఖరారవగా మెదక్ నుంచి రఘునందన్ రావు,  నల్లగొండ నుంచి సునీతారెడ్డి బరిలో నిలబడొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో చికోటి ప్రవీణ్ కుమార్, ఎంఎల్‌ఎ రాజాసింగ్, ఆకుల విజయ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక వరంగల్ నుంచి మాజీ ఐపిఎస్ కృష్ణా ప్రసాద్ నిలబడొచ్చన్న ప్రచారం జరుగుతోంది. భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి భగవంతరావు నిలబడతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − six =