ఏజ్ పెరిగే కొద్దీ మహిళలకు ఏ విటమిన్స్ అవసరం?

What Vitamins Womens Need To Take According To Age, What Vitamins Womens Need, Vitamins Womens Need, According To Age What Vitamins Womens Need, You Have To Eat, Fit, Vitamins, Women Need As They Age, Womens Vitamins Take According To Age, Diet Plan, Health Tips, Healthy Diet, Healthy Food, Weight Loss, Mango News, Mango News Telugu
You have to eat , fit,vitamins, women need as they age

చిన్న పిల్లలకు ఎదగడానికి ఎన్ని విటమిన్లు కావాలో.. ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా విటమిన్లు అందరికీ అవసరపడతాయి. ముఖ్యంగా మహిళలలో పీరియడ్స్, ప్రెగ్నెన్సీ వల్ల విటమిన్లు, పోషకాల లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. హార్మోన్ల బ్యాలన్స్ కాకపోవడం వల్ల, జీవనశైలిలో మార్పుల వలన ఈ లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా చర్మం, జుట్టు, ఎముకలకు సంబంధించిన సమస్యలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. దీనివల్ల తరచుగా మహిళలు బ్యాక్ పెయిన్, కాళ్లలో నొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. మహిళలు ఇలాంటి అనారోగ్యాలకు గురికాకుండా ఉండాలంటే 5 విటమిన్లు కచ్చితంగా అవసరమని వైద్యులు చెబుతున్నారు.

విటమిన్ ఇ లోపంతో..
మహిళలు చాలా కాలం పాటు యవ్వనంగా, అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. దీని కోసం విటమిన్ ఇ సమృద్ధిగా అవసరం. చర్మం, జుట్టు, గోర్లు అందంగా ఉండటానికి విటమిన్ ఇ చాలా అవసరం. విటమిన్ ఈ ముడతలు, మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. బాదం, వేరుశెనగ, వెన్న, పాలకూర వంటి ఆహారాలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ B9 లోపంతో..
గర్బధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ సమయంలో శరీరానికి ఎక్కువ విటమిన్లు అవసరం. ప్రసవ సమయంలో విటమిన్ లోపం అనేక సమస్యలకు దారితీస్తుంది. ప్రెగ్నీన్సీ సమయంలో మహిళలు బీన్స్, ధాన్యాలు, ఈస్ట్ మొదలైన ఆహారాలను తీసుకోవాలి. ఇందులో విటమిన్ బి 9 (ఫోలిక్ యాసిడ్) ఎక్కువగా ఉంటుంది.విటమిన్ ఎ లోపంతో..40, 45 ఏళ్ల వయసు గల స్త్రీలు హార్మోన్ల మార్పునకు గురవుతారు. అందువల్ల ఈ సమయంలో మహిళలు క్యారెట్లు, బొప్పాయి, గుమ్మడికాయ గింజలు, పాలకూర వంటి విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

విటమిన్ కె లోపంతో..
కొంతమంది మహిళలు పీరియడ్స్ టైమ్స్ లో , ప్రసవ సమయంలో చాలా రక్తం కోల్పోతారు. ఈ రెండు పరిస్థితులలోనూ విటమిన్ కె శరీరానికి అవసరం. ఇది అధిక రక్త నష్టం సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. సోయాబీన్ నూనె, ఆకుపచ్చ కూరగాయలలో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ డి లోపంతో..

ఏజ్ పెరిగే కొద్దీ, మహిళలకు బోన్స్ కు సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. వెన్నునొప్పి, మోకాలి, చీలమండ నొప్పి వంటి సమస్యలు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి కాల్షియం, విటమిన్ డి అవసరం. పుట్టగొడుగులు, పాలు, జున్ను, సోయా ఉత్పత్తులు, గుడ్లు, వెన్న, ఓట్మీల్, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు వంటి ఆహారాలు తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం సూర్యకిరణాలు పడేటట్లు కాసేపు ఎండలో నిల్చోవాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =