గ్రామ వాలంటీర్లు ఈ సమయంలో కీలక పాత్ర పోషించాలి – పవన్ కళ్యాణ్

Andhra Pradesh, AP Coronavirus, AP COVID 19 Cases, AP Lockdown, Coronavirus, Coronavirus Update, COVI 19, COVID-19, COVID-19 Cases, Janasena, Janasena Pawan Kalyan, Mango News Telugu, pawan kalyan, Pawan Kalyan Asks Village Volunteers to Work Properly, Pawan Kalyan Latest News

కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యల్లో గ్రామ వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు.

ఈ మేరకు ట్విట్టర్ లో స్పందిస్తూ, ” రాష్ట్రం పరీక్షా సమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామ వాలంటీర్లు తగిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, కొన్ని వేల మంది జనం బయటికి వచ్చి రేషన్‌ షాపుల ముందు క్యూలో నిలబడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ప్రతి ఇంటికి రేషన్‌ సరకులు మేమిస్తామని, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందజేస్తామని వైసీపీ ప్రభుత్వం మాట ఇచ్చింది. ఈ మాట ప్రకారం గ్రామ వాలంటీర్లు తమ బాధ్యతని ఇంకా బాగా నిర్వర్తించి, జనం రోడ్ల మీదకి రాకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో మరింత కష్టపడి ఏప్రిల్ 14 వరకు ప్రధాని మోదీ విధించిన లాక్ డౌన్ ను విజయవంతం చేస్తూ తమ బాధ్యతను వాలంటీర్లు నెరవేరుస్తారని ఆశిస్తున్నానని’ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:

కరోనా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి – పవన్ కళ్యాణ్

కరోనా ఎఫెక్ట్: తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దన్న రామ్ చరణ్

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =