క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు జపాన్ చేరుకున్న ప్రధాని మోదీ, ప్రవాస భారతీయుల ఘనస్వాగతం

PM Modi Arrives in Japan on Two-Day Visit To Attend Quad Summit and Bilateral Meets, Prime Minister Narendra Modi Arrives in Japan on Two-Day Visit To Attend Quad Summit and Bilateral Meets, PM Modi Arrives in Japan on Two-Day Visit To Attend Quad Summit, Modi Arrives in Japan on Two-Day Visit To Attend Quad Summit and Bilateral Meets, Bilateral Meets, Quad Summit, PM Modi Arrives in Japan on Two-Day Visit, Modi Arrives in Japan on Two-Day Visit, PM Modi Two-Day Visit on Japan, PM Modi Japan Tour, PM Modi Japan Tour News, PM Modi Japan Tour Latest News, PM Modi Japan Tour Latest Updates, PM Modi Japan Tour Live Updates, PM Modi to attend Quad summit in Tokyo, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవ క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు జపాన్ దేశంలో అడుగు పెట్టారు. ఇండియాతో పాటు అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియాతో కూడిన ‘క్వాడ్’ అనేది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక సహకారంపై భాగస్వామ్య ప్రయోజనాల ఆధారంగా ఏర్పాటు చేయబడింది. క్వాడ్ ఏర్పాటు, అనేక దేశాలతో ప్రాదేశిక వివాదాలు ఉన్న ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దురాక్రమణను ఎదుర్కోవడానికి చేసిన ప్రయత్నమని ప్రపంచ దేశాల అభిప్రాయం. తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా మరియు వియత్నాం వంటి దేశాలతో ఇప్పటికే చైనాకు పలు వివాదాలు ఉన్నాయి. అలాగే దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలు మరియు సైనిక స్థావరాలను నిర్మించిందని ఈ దేశాలు ఆరోపిస్తున్నాయి.

ఇక మరోవైపు తూర్పు సముద్రంపై చైనాకు జపాన్‌తో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో.. మోదీతో పాటు మే 24న టోక్యోలో జరిగే క్వాడ్ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికైన ఆంథోనీ అల్బనీస్ హాజరవుతారు. ఈ సమావేశంలో ప్రపంచ ఉద్రిక్తతలు మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం మరియు భద్రతకు విఘాతం కలిగించే సవాళ్లపై భవిష్యత్ సహకారం కోసం కీలక చర్చలు నిర్వహించనున్నారు. అలాగే శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ.. బిడెన్, కిషిదా, అల్బనీస్‌లతో వేర్వేరుగా ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. జపాన్ పర్యటనపై తన అభిప్రాయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం జపాన్ రాజధాని టోక్యో నగరానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంతో పాటు టోక్యోలో మోదీ బస చేసిన హోటల్ న్యూ ఒటానీ వద్ద భారీ సంఖ్యలో హాజరైన ప్రవాస భారతీయులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ‘హర్ హర్ మోదీ’, ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో టోక్యో వీధులు మార్మోగాయి. ప్రధాని రాక సందర్భంగా ప్రవాస భారతీయుల చిన్నారులు.. పలు ప్రాంతీయ భాషలలో స్వాగతం అని రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − three =