చేనేత‌కు అండ‌గా పెమ్మ‌సాని..

Pemmasani Was Raised As A Weaver, Raised As A Weaver, Pemmasani As A Weaver, Pemmasani Chandrasekhar, TDP, Guntur TDP, MP Candidate, Lok Sabha Elections, Latest Guntur News, Guntur Politics, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Pemmasani chandrasekhar, tdp. guntur tdp mp candidate, lok sabha elections

ప్ర‌తి స‌మ‌స్య‌కూ ఓ ప‌రిష్కారం.. ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం చేయాల‌నే ఆలోచ‌న‌తో ముంద‌డుగు వేస్తున్నారు.. డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌. గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూట‌మి అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న పెమ్మ‌సాని.. వినూత్న పంథాలో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. ప్ర‌జాసేవ‌లో ఎప్ప‌టినుంచో నిమ‌గ్న‌మై ఉన్న ఆయ‌న.. ఓ ల‌క్ష్యం.. ఓ ఆశ‌యంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చానంటూ.. ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. అన్ని వ‌ర్గాల‌నూ ఆద‌రిస్తూ, త‌న‌ను గెలిపిస్తే ఎవ‌రికి ఏం చేస్తానో స్ప‌ష్టంగా చెబుతూ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పేరు కోస‌మో.., డ‌బ్బు కోస‌మో.. రాజ‌కీయాలు చేయాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని, రాజ‌కీయాల్లోకి రాక‌ముందే.. అవ‌స‌ర‌మైనంత పేరు, అవ‌స‌రానికి మించిన డ‌బ్బు త‌న ద‌గ్గ‌ర ఉంద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు వెల్ల‌డిస్తున్నారు. ఆయ‌న మాట‌ల్లోని గాంభీర్యం, చేసేప‌నిలో నిజాయితీ.. డాక్ట‌ర్ పెమ్మ‌సానిని గుంటూరు ప్ర‌జ‌ల‌కు రోజురోజుకూ ద‌గ్గ‌ర చేస్తున్నాయి.

త‌న‌ను గెలిపిస్తే.., అన్ని రంగాల్లోనూ గుంటూరును అద‌ర్శ‌వంతంగా నిల‌ప‌డమే త‌న ధ్యేయం అంటున్నారు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌. ఐటీతో పాటు వ్య‌వ‌సాయం, చేనేత‌, రిటైల్‌, విద్య.. అన్ని రంగాల‌పైనా ఆయ‌న దృష్టి సారిస్తున్నారు. ప్ర‌ధానంగా చేనేత క‌ళాకారుల‌కు, చేనేత ఉత్ప‌త్తుల‌కు స‌హ‌కారం అందించాల‌న్న ప్లాన్‌తో ఉన్నారు పెమ్మ‌సాని. ఇక్క‌డ త‌యార‌వుతున్న వ‌స్త్రాలను అంత‌ర్జాతీయ మార్కెట్ లో విక్ర‌యించేందుకు ఎందుకు లేవు? నాణ్య‌త‌లో స‌మ‌స్యా.., డిజైన్‌ల‌లో లోప‌మా? ప్ర‌భుత్వ స‌హ‌కారంలో లోప‌మా.. అనేది విశ్లేషిస్తున్నారు. నేత‌న్న‌ల కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే.. వారి క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ద‌క్కాల‌ని.. ఆ దిశ‌గా శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని పెమ్మ‌సాని హామీ ఇస్తున్నారు. చేనేత వ‌స్త్రాల నాణ్య‌త‌లో లోపాలుంటే.. వాటిని ప‌రిష్క‌రిస్తాన‌ని, నిపుణుల‌తో చ‌ర్చించి, ఇత‌ర చోట్ల ఉన్న సాంకేతిక అంశాల‌పైనా దృష్టి సారించి.., వాటిని వినియోగించేందుకు సిద్ధం అవుతున్నారు.

చేనేత వ‌స్త్రాల మార్కెటింగ్‌కు ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ ఏర్పాటుపై పెమ్మ‌సాని ఇప్ప‌టినుంచే క‌స‌ర‌త్తు చేస్తున్నారు.  గెలిచిన వెంట‌నే చేనేత కుటుంబాల‌కు మేలు చేసే ప్ర‌ణాళిక‌లను సిద్ధం చేస్తున్నారు. ప్ర‌తి స‌మ‌స్య‌నూ లోతుగా అధ్య‌య‌నం చేసి, అధికారంలోకి వ‌చ్చిన రెండు, మూడేళ్ల‌లోనే స‌మ‌గ్ర ప‌రిష్కారం చూపుతాన‌ని భ‌రోసా ఇస్తున్నారు. ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే.. పోటీలో నిల‌బ‌డ్డ వ్య‌క్తులు హామీలు గుప్పించ‌డం మామూలే. మాటే క‌దా.. అనే ధోర‌ణిలో ప‌రిష్కార‌మార్గాలు ఆలోచించ‌కుండానే హామీలు గుప్పించేస్తుంటారు. తీరా గెలిచాక‌.. వాటిని ఎలా అమ‌లు చేయాలో తెలియ‌క‌, ప‌రిష్కారం దొర‌క‌క.. ప్ర‌శ్నించే ప్ర‌జ‌ల నుంచి త‌ప్పించుకుతిరుగుతుంటారు. కాల‌యాప‌న చేస్తూ ప‌బ్బం గ‌డిస్తారు.

కానీ.. పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ అంద‌రికంటే భిన్నంగా ఆలోచిస్తున్నారు. స‌మ‌స్య‌ను పూర్తిగా అధ్య‌య‌నం చేశాక ప‌రిష్కారం చూపుతాన‌ని, అందుకు కొంత స‌మ‌యం అవ‌స‌ర‌మ‌ని ..  ప్ర‌జ‌ల‌కు ముందుగానే నిజాయితీగా తెలియ‌జేస్తున్నారు. అందుకే ప్ర‌జ‌ల్లోనూ పెమ్మ‌సాని అంటే గౌర‌వం.. ఆయ‌న మాటంటే న‌మ్మ‌కం.. ఏర్ప‌డుతున్నాయ‌ని గుంటూరు లోక్‌స‌భ ప‌రిధిలో ప్ర‌చారం జ‌రుగుతోంది. మెజారిటీ ప్ర‌జ‌లు పెమ్మ‌సానికి జై కొట్టేందుకు సిద్దం అవుతున్నార‌న్న సంకేతాలూ క‌నిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 2 =