సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ

PM Narendra Modi Extended Best Wishes to AP CM YS Jagan on His Birthday,Birthday Wishes Pour in For Andhra Pradesh CM YS Jagan Mohan Reddy,Andhra Pradesh CM Jagan Mohan Reddy Turns 48,PM Modi Greets CM Jagan,Andhra Pradesh,Andhra Pradesh News,CM Jagan Mohan Reddy,PM Narendra Modi Extended Best Wishes to AP CM YS Jagan,PM Modi Conveys Birthday Wishes To YS Jagan,PM Narendra Modi Greets Andhra Pradesh CM Jagan Mohan Reddy On His Birthday,Prime Minister Narendra Modi,Andhra Pradesh CM YS Jagan,PM Narendra Modi Birthday Wishes,Mango News,Mango News Telugu,PM Narendra Modi Best Wishes to AP CM YS Jagan on His Birthday,YS Jagan Mohan Reddy Birthday,Birthday Greetings To Andhra Pradesh CM Jagan

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, అభిమానులు, వైస్సార్సీపీ నాయకులు, పార్టీ శ్రేణుల నుంచి సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.‌ ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం సీఎం వైఎస్ జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్ ‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

అలాగే సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.  తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటిఆర్, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు సహా పలువురు ప్రముఖులు సీఎం వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + nine =