ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో సీఎం జగన్‌ భేటీ.. పలు కీలక అంశాలపై గంటకు పైగా చర్చ

AP CM YS Jagan Meets Governor Abdul Nazeer at Raj Bhavan To Discuss State Issues,AP CM YS Jagan Meets Governor,Governor Abdul Nazeer at Raj Bhavan,AP CM YS Jagan To Discuss State Issues,Mango News,Mango News Telugu,CM YS Jagan Meets Governor Abdul Nazeer,Jagan Pays Courtesy Visit To Governor, AP CM YS Jagan Latest News,AP CM YS Jagan Latest Updates,Governor Abdul Nazeer Latest News,Governor Abdul Nazeer Latest Updates,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం జగన్ గవర్నర్‌ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వీరిరువురూ దాదాపు గంట 15 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. భేటీలో భాగంగా.. సీఎం జగన్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. అలాగే విశాఖపట్నం వేదికగా మంగళవారం జరుగనున్న జీ-20 ప్రతినిధుల సమావేశం గురించి కూడా గవర్నర్ నజీర్‌కు తెలియజేసినట్లు సమాచారం. వీటితో పాటుగా రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి జగన్ గవర్నర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీ అనంతరం సీఎం జగన్ రాజ్‌భవన్ నుంచి తాడేపల్లి బయల్దేరి వెళ్లారు. కాగా నేడు విశాఖలో జరిగే జీ-20 సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ సహా పలువురు కేంద్ర మంత్రులు సైతం హాజరవుతున్నారు. ఇక ఈ సదస్సు నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here