సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ

Andhra Pradesh CM Jagan Mohan Reddy, Andhra Pradesh CM Jagan Mohan Reddy Turns 48, AP CM YS Jagan, AP CM YS Jagan Birthday, Mango News, Mango News Telugu, Modi Extends Greetings to AP CM YS Jagan, Narendra Modi, PM Modi greets Andhra Pradesh Chief Minister, pm narendra modi, PM Narendra Modi Extends Greetings to AP CM YS Jagan, PM Narendra Modi Extends Greetings to AP CM YS Jagan on his Birthday, PM wishes AP CM Reddy on his birthday, Wishes pour for Andhra Pradesh CM Jagan Mohan Reddy, YS Jagan Birthday, YS Jagan Birthday Whishes

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టినరోజు (డిసెంబర్ 21) నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వైస్సార్సీపీ నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణుల నుంచి సోషల్‌ మీడియా వేదికగా సీఎం వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.‌ ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం సీఎం వైఎస్ జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్ ‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుని ఆశీస్సులతో జీవితాంతం ఆయురారోగ్యాలతో జీవించాలి” అంటూ ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

అలాగే సీఎం వైఎస్ జగన్ కు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు సీఎం వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు తాడేపల్లిలోని నివాసంలో రాష్ట్ర మంత్రుల సమక్షంలో ఈ రోజు ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, సీఎస్‌ సమీర్‌ శర్మ సహా పలువురు అధికారులు పాల్గొని సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 6 =