టీటీడీ ఆగమ సలహా మండలి సభ్యునిగా రమణ దీక్షితులు నియామకం

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, Ramana Dikshitulu Appointed As Member Of TTD, Ramana Dikshitulu Appointed As Member Of TTD Agama Advisory, Ramana Dikshitulu Appointed As Member Of TTD Agama Advisory Board, Ramana DikshituluAs Member Of TTD Agama Advisory Board, TTD Agama Advisory Board, TTD Latest News

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆగమ సలహా మండలి సభ్యునిగా ఏవీ రమణ దీక్షితులు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకనుగుణంగా టీటీడీ తిరిగి ఆయన్ను విధుల్లోకి తీసుకుంది. ఈ మేరకు నవంబర్ 5, మంగళవారం నాడు టీటీడీ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో తిరుమల శ్రీవారి ఆలయంలో రమణ దీక్షితులు ప్రధాన అర్చకులుగా పనిచేసారు. అనువంశిక అర్చకులలైన రమణ దీక్షితులను పదవీ విరమణ అంశం ద్వారా సంవత్సరంన్నర క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో విధులనుంచి తొలగించారు. ఆ సమయంలో వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రమణ దీక్షితులును తిరిగి మళ్లీ టీటీడీ లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అప్పటి హామీ ప్రకారమే ఇప్పుడు ఆగమ సలహా మండలి సభ్యునిగా బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది.

సలహాదారుడితో పాటు ఆలయంలో కొత్తగా నియమితులయ్యే అర్చకులకు సలహాలు, సూచనలు, శిక్షణ ఇచ్చే అదనపు బాధ్యతలను కూడ అప్పగించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాముఖ్యత, సంప్రదాయాలుతో పాటు అక్కడి సేవల పట్ల ఆయనకు ఉన్న అపార పరిజ్ఞానం, అనుభవం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. తన నియామకం ప్రకటించిన అనంతరం, రమణ దీక్షితులు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని కలుసుకుని చర్చించారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 20 =