స‌రికొత్త పంథాలో ప్ర‌లోభాల ప‌ర్వం!

Receipt For Vote Buying?, Vote Buying, Vote, Buying Votes, AP State Assemble Elections, Lok Sabha Elections, AP State, Telangana State, Voters, Receipt For Vote, Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
AP state Assemble elections , Lok Sabha Elections , Ap state , Telangana State , Voters

మ‌రో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ స్థానాల‌కు, తెలంగాణ‌లో 17 లోక్‌స‌భ స్థానాల‌కు వ‌చ్చే సోమ‌వారం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఓట్ల కోసం ఇప్ప‌టి నుంచే నేత‌లు ప్ర‌లోభాల ప‌ర్వం మొద‌లుపెట్టేశారు. పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తున్నారు. కాగా.., డ‌బ్బు పంపిణీలో ఈసారి కొత్త ట్రెండ్ మొద‌లైంది. డ‌బ్బు ఎవ‌రికి ఇస్తున్నామో., ఎంత ఇస్తున్నామో ప‌క్కా లెక్క కోసం ఏకంగా ర‌శీదుల‌ను ముద్రిస్తున్నారు. డ‌బ్బు అంద‌రికీ అంద‌డం లేద‌ని, మ‌ధ్య‌లో ఉన్న‌వారు తినేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో.. ప్ర‌లోభ‌ప‌ర్వాన్ని వినూత్నంగా చేప‌ట్టేందుకు సిద్ధం అవుతున్నారు. అభ్య‌ర్థులు.

ప్ర‌త్యేక హోలోగ్రామ్ తో కార్డుల ముద్ర‌ణ‌ ఏపీలోని ప‌ల్నాడు జిల్లాలో ప్ర‌లోభ‌ప‌ర్వంలో కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చారు. ప్ర‌త్యేక హోలోగ్రామ్‌తో ముద్రించిన కార్డుల‌ను పంపిణీ చేస్తున్నారు. త‌మ‌కు ఓటు వేస్తార‌నుకునే వారికే ఆ కార్డుల‌ను అందిస్తున్నారు. ఆ కార్డు తెచ్చిన వారికే ఓటుకు నోటు ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. ఆ మేర‌కు ర‌శీదులు కూడా సిద్ధం చేశారు. సీరియ‌ల్ నంబ‌ర్‌, పేరు, గ్రామం, బూత్ నంబ‌ర్‌, క్ర‌మ‌సంఖ్య‌తో ఏకంగా ర‌శీదుల‌ను ముద్రించారు. ఓట‌రు పూర్తి వివ‌రాల‌ను న‌మోదు చేసుకుని ఓటుకు నోటు ఇస్తున్నారు. ఒక్కో ఓటుకు 3 వేల రూపాయ‌లు ఇస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌ల్నాడు జిల్లాలోని ఓ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ కొత్త ట్రెండ్ మొద‌లైంది. క‌నీసం ల‌క్షా 70 వేల ఓట్లు కొనుగోలు చేయాల‌ని ప్ర‌ధాన పార్టీలు ప్లాన్ చేసుకున్న‌ట్లు ఆ ర‌శీదుల సీరియ‌ల్ నంబ‌ర్ ను బ‌ట్టి తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − two =