టీడీపీకి రాజీనామా చేసిన సాదినేని యామిని

AP Breaking News, AP Breaking News Today, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Chandrababu Naidu, Mango News Telugu, President of the TDP, Sadineni Yamini Latest News, Sadineni Yamini Quits TDP, Sadineni Yamini Resigns To TDP, Sadineni Yamini To Quit TDP, Sadineni Yamini To Resign From TDP

గత సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం అనంతరం టీడీపీకి చెందిన పలువురు నాయకులు వైసీపీ, బీజేపీ పార్టీల్లో చేరుతున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా టీడీపీ పార్టీకి మరో షాక్‌ తగిలింది. టీడీపీకి సాదినేని యామిని శర్మ రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు నవంబర్ 7, గురువారం నాడు ఆమె రాజీనామా లేఖ రాశారు. పార్టీలో ఎదుర్కోన్న కొన్ని అంతర్గత విభేదాలు, ఇబ్బందులు గురించి వివరించి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రోత్సహం మరువలేనిదని లేఖలో పేర్కొన్నారు.

ఎన్నికల్లో పార్టీ పరాజయం అనంతరం, యామిని శర్మ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అప్పటినుంచే ఆమె పార్టీ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి, ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలుసుకోవడంతో బీజేపీ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు కూడ వస్తున్నాయి. అతి త్వరలో ఏ పార్టీలో చేరబోయేది, రాజకీయాల్లో తన భవిష్యత్ కార్యాచరణపై సాదినేని యామిని ప్రకటించే అవకాశం ఉంది.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here