ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీల నియామకం

AP Assembly Committees With New Members, AP Assembly Committees With New Members In AP, AP Government Appointed AP Assembly Committees With New Members, AP Govt Appointed AP Assembly Committees With New Members, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Govt Appointed AP Assembly Committees With New Members, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు కమిటీలను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలకు కొత్తగా చైర్మన్‌, సభ్యులను నియమించారు. కమిటీలలో భాగంగా రూల్స్‌ కమిటీ చైర్మన్‌గా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమించింది. ఈ కమిటీలో వల్లభనేని వంశీ, ఆనం రాంనారాయణ రెడ్డి, చిన అప్పలనాయుడు, ధర్మాన ప్రసాదరావు, మానుగుంట మహీధర్ రెడ్డి, అప్పలనాయుడులను సభ్యులుగా నియమించారు. అదే విధంగా పిటీషన్ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో పాటు ఆరుగురు సభ్యులను నియమించారు. ఇందులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్, కాసు మహేష్ రెడ్డి, ముదునూరి ప్రసాదరాజు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీడీపీ నుండి ఏలూరి సాంబశివ రావులు ఉన్నారు.

ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా అంబటి రాంబాబును నియమించారు. ఇందులో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు చెన్నకేశవ రెడ్డి, జగన్మోహన రావు, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, మేకా వెంకట ప్రతాప అప్పారావు లకు చోటు దక్కింది. సభ హక్కుల కమిటీ చైర్మన్‌గా కాకాని గోవర్ధన్ రెడ్డిని , ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా కొట్టు సత్యనారాయణను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం నవంబర్ 7, గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 4 =