తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఈనెల 31కి వాయిదా

Telangana High Court To Give Final Verdict on Anticipatory Bail of MP Avinash Reddy on May 31st,Telangana High Court To Give Final Verdict,Telangana Final Verdict on Anticipatory Bail,Anticipatory Bail of MP Avinash Reddy,Anticipatory Bail of MP Avinash on May 31st,Mango News,Mango News Telugu,Telangana High Court News Today,MP Avinash Reddy Latest News,MP Avinash Reddy Latest Updates,MP Avinash Reddy Live News,MP Avinash Anticipatory Bail,MP Avinash Bail Latest News,MP Avinash Bail Latest Updates,YS Viveka Assassination Case Latest Updates,YS Viveka Assassination Case Live News

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తొలినుంచి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. కేసు విచారణలో భాగంగా తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఈనెల 31కి వాయిదా వేసింది. బుధవారం లోపు తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. బుధవారం తీర్పు వెలువరించేవరకూ ఆయనను అరెస్ట్ చేయవద్దని సీబీఐకి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాగా గత మూడు రోజులుగా తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ఎదుట వాదనలు వాడీవేడిగా జరిగాయి. శుక్రవారం అవినాష్‌ రెడ్డి మరియు వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి తరపున వాదనలు విన్న న్యాయస్థానం, ఈరోజు సీబీఐ వాదనలను ఆలకించింది. ఈ క్రమంలో తల్లి అనారోగ్యం కారణంగా ఎంపీ అవినాష్ రెడ్డిపై ఎలాంటి ముందస్తు అరెస్టులు చేయవద్దని, ఈనెల 31న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here