ఈసారి కూడా వైసీపీదే విజయమా?

Internal War Of TDP Leaders In Guntakallu, Internal War Of TDP, TDP Leaders In Guntakallu, YCP, TDP, Janasena, Chandrababu, Jagan, TDP leaders, Guntakallu,Jayaram, Venkatrami Reddy, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
YCP, TDP, Janasena, Chandrababu, Jagan, TDP leaders, Guntakallu,Jayaram, Venkatrami Reddy

కర్నూల్ జిల్లా గుంతకల్లులో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. తెలుగు దేశం పార్టీ తరపున మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పోటీ చేస్తుండగా.. వైఎస్సార్సీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఎన్నికల బరిలో ఉండటంతో ఈసారి ఆసక్తికరపోరు జరగనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
రైల్వే ఉద్యోగులు ఎక్కువమంది ఉండే గుంతకల్లు నియోజకవర్గంలో ..మొత్తం 2,52,352 మంది ఓటర్లు ఉన్నారు. రైల్వే ఉద్యోగులతో పాటు క్రిస్టియన్ జనాభా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటుంది .

2009లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి జితేంద్రగౌడ్‌ని కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఓడించారు. అయితే 2014లో ఆర్ జితేంద్ర గౌడ్.. కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ గుప్తాను ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించి రివెంజ్ తీర్చుకున్నారు. కానీ 2019లో వైఎస్సార్‌సీపీకి చెందిన వై.వెంకటరామి రెడ్డి.. తెలుగు దేశం పార్టీ నుంచి బరిలో దిగిన జితేంద్ర గౌడ్‌ను ఓడించారు.
ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో జితేంద్ర గౌడ్‌ను పక్కన పెట్టిన తెలుగు దేశం పార్టీ అధినేత.. జయరాంకు టీడీపీ టికెట్ ఇచ్చారు. గుంతకల్‌‌లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా జయరాం పేరును ప్రకటించిన వెంటనే.. మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్రగౌడ్‌తోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు జయరాం పార్టీలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

అయితే తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి.. అసంతప్తులను బుజ్జగించినా కూడా ఇంకా కొంతమంది జయరాంకు సహకరించడం లేదు. మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గుంతకల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ తాను చేసిన అభివృద్ధికి తోడు జగన్ సర్కార్ అందించిన సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని నమ్మకంతో ఉన్నారు.

ఇటు టీడీపీలో చూస్తే.. వైఎస్పార్సీపీ నుంచి తెలుగు దేశం పార్టీలోకి చేరి టికెట్ సంపాదించిన జయరాంకు కొంతమంది తెలుగు తమ్ముళ్లు పని చేస్తుండటం కేడర్ ను ఆందోళనలో పడేస్తుంది. మొత్తంగా గుంతకల్లు పోరులో ఆధిపత్య పోరుతో ఉన్న టీడీపీని వైసీపీ ఓడించే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా తెలుగు దేశం కేడర్ అంతా కలిసి నడిస్తే తప్ప వెంకట్రామిరెడ్డిని విజయాన్ని ఆపలేరన్న టాక్ నడుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − fifteen =