ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 21, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,557 కు చేరుకుంది. బుధవారం 9AM నుంచి గురువారం 9AM వరకు 49,483 కరోనా పరీక్షలు నిర్వహించగా 139 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన కొత్తగా ఎటువంటి మరణం సంభవించలేదు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7142 గా ఉంది. మరోవైపు గత 24 గంటల్లో 254 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,77,893 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1522 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ