కుప్పంలో రెండోరోజు చంద్రబాబు నాయుడు పర్యటన

Andhra Pradesh, Chandrababu, chandrababu kuppam tour, Chandrababu Naidu, Chandrababu Naidu Kuppam, Chandrababu Naidu Tour Kuppam District, Chandrababu Naidu visit Kuppam, Chandrababu Tour in Kuppam Constituency, Kuppam, Kuppam constituency, Mango News, TDP Chief Chandrababu Kuppam Tour, TDP Chief Chandrababu Naidu Second Day Visit in Kuppam Tour, TDP Chief Chandrababu Tour in Kuppam Constituency, TDP Chief Chandrababu Tour in Kuppam Constituency From Jan 6 to 8th

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని పలుప్రాంతాలనుంచి వస్తున్న ప్రజలను ఉదయం ఆయన బసచేసిన అతిథి గృహం వద్ద కలవనున్నారు. అక్కడ వివిధ సమస్యలపై వారి నుంచి చంద్రబాబు వినతి పత్రాలను స్వీకరిస్తారు. అనంతరం కుప్పం ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. తదుపరి 11 గంటలకు కుప్పం మండలం దాసిగానూరు ట్యాంక్‌ను పరిశీలించనున్నారు.

అలాగే, దాసిగానూరులోని గంగమ్మ దేవాలయంలో చంద్రబాబు పూజలు నిర్వహించనున్నారు. కుప్పం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. కొత్త ఇండ్లు, నూలకుంట, గుట్టపల్లి క్రాస్, మిట్టపల్లి, వేపురా, ఎన్.కొత్తపల్లి, గేరీగచేనుపల్లి మొదలగు గ్రామాల్లో ఈ పర్యటన సాగనుంది. రోడ్ షో అనంతరం చంద్రబాబు తిరిగి కుప్పం చేరుకొని రాత్రికి అతిథి గృహంలో బస చేయనున్నారు. చంద్రబాబును కలిసి వినతిపత్రాలు ఇచ్చేందుకు ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 10 =