మాన్సాస్ ట్రస్టు చైర్మన్ నియామక జీవో కొట్టేసిన హైకోర్టు, అశోక్ గజపతిరాజును తిరిగి నియమించాలని ఆదేశాలు

Andhra Pradesh High Court, AP High Court, AP High Court Cancels GO of Mansas Trust Chairman Appointment, AP High Court cancels Sanchaita’s appointment, Ashok Gajapathi Raju, GO of Mansas Trust Chairman Appointment, HC issues notices on Sanchaitha’s appt, High Court Cancels GO of Mansas Trust Chairman Appointment, Mango News, MANSAS Trust Chairman, MANSAS Trust Chairman Appointment, Order to Re Appoint Ashok Gajapathi Raju

విజయనగరం మాన్సాస్ ట్రస్టు చైర్మన్ నియామకంపై ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. 2020 మార్చిలో మాన్సాస్‌, సింహాచలం ట్రస్టుల చైర్మన్ గా ఉన్న టీడీపీ నేత, మాజీ ఎంపీ అశోక్ గజపతి రాజును తొలగించి, ఆయన స్థానంలో సంచయిత గజపతిరాజును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 72ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వంశపారంపర్యంగా వస్తున్న మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌ స్థానం నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ అశోక్ గజపతి రాజు హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై హైకోర్టు పలుమార్లు విచారణ నిర్వహించింది. విచారణలో భాగంగా ఈ అంశంపై సంచయిత గజపతి దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. అప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సోమవారం నాడు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.72ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. సింహాచలం దేవస్థానానికి, మాన్సాన్ ట్రస్టుకు చైర్మన్ గా అశోక్ గజపతిరాజును తిరిగి నియమించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here