ఆస‌క్తిక‌రంగా అన‌కాప‌ల్లి రాజ‌కీయం

Interesting Politics In Anakapalli During The Election, Anakapalli Interesting Nominations, Anakapalli Interesting Politics, Anakapalli Nominations, Anakapalli Politics, Anakapalli Politics Latest News, Anakapalli Politics Updates, AP Politics, AP State political, AP State Politics, Elections, Nominations, Mango News, Mango News Telugu
Anakapalli Interesting Politics , Anakapalli Nominations Anakapalli , Anakapalli Politics ,Anakapalli Politics Latest News ,Anakapalli Politics Updates,AP Politics AP , AP State ,

ఒక‌రేమో రాజ‌కీయాల్లోకి కొత్త‌.. మ‌రొక‌రేమో రాజ‌కీయాల్లో త‌ల‌పండిన నేత‌. ఇద్ద‌రూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా నువ్వా-నేనా సై అంటూ అన‌కాప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో త‌ల‌ప‌డుతున్నారు. వారే జ‌న‌సేన అభ్య‌ర్థి కొణ‌తాల రామ‌కృష్ణ‌. మ‌రొక‌రు వైసీపీ అభ్య‌ర్థి మ‌ల‌సాల భ‌ర‌త్‌. కొత్త‌, పాత నేత‌ల మ‌ధ్య పోరుతో ఇక్క‌డి రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. గెలుపు ఎవ‌రిని వ‌రించ‌నుందో అనేది ఆస‌క్తిగా మారింది.

అనకాపల్లి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేరుంది. 1985 నుంచి 99 వరకూ టీడీపీ తరపున దాడి వీరభద్రరావు వరుస విజయాలు సాాధించారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో గంటా శ్రీనివాసరావు గెలిచారు. 2019లో వైసీపీ టికెట్ మీద గెలిచిన గుడివాడ అమర్ నాథ్ ఏపీ ఐటీ శాఖమంత్రి పదవిని దక్కించుకున్నారు. మారిన రాజకీయ లెక్కల్లో జగన్ ఈసారి అనకాపల్లి టికెట్ ను మలసాల భరత్ కు కేటాయించారు. కశింకోట మండలానికి చెందిన మలసాల భరత్ రాజకీయాలకు కొత్త. ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ.. మలసాల భరత్ చదవు తర్వాత అమెరికాలో వ్యాపారాలు చేశారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఏడాది క్రితం రాష్ట్రానికి తిరిగి వచ్చారు. అధికార పార్టీ వైపీపీలో చేరారు. ఏడాదికే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోగలిగారు.

రాజ‌కీయాల‌కు కొత్త అయిన‌ప్ప‌టికీ ప్ర‌చారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా ప్ర‌సంగిస్తున్నారు. ఆయనపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. నియోజకవర్గం ప్రజలతో పెద్దగా పరిచయాలు లేవు. కేవలం పార్టీ గుర్తు, సీఎం వైఎస్ జగన్ ఇమేజ్‌ను మలసాల భరత్ నమ్ముకున్నారు. ప్రత్యర్థి బలమైన వ్యక్తి అయిన‌ప్ప‌టికీ.. గట్టి పోటీని  ఇస్తున్నారు. ఇక ఇక్క‌డి నుంచి జనసేన అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. అనకాపల్లి ప్రజలకు కొణతాల రామకృష్ణ సుపరిచితులు. పార్లమెంట్ సభ్యులుగా, శాసన సభ్యుడిగా గతంలోపనిచేశారు. 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. టీడీపీ, బీజేపీ మద్దతు ఆయనకు కలిసొచ్చే అంశంగా మారనుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే పడుతుందని కొణతాల రామకృష్ణ ఆశలు పెట్టుకున్నారు.  అనకాపల్లి నియోజకవర్గం పరిధిలో 2లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. కాశింకోట, అనకాపల్లి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం ఓటర్లలో 45 శాతంగా ఉన్న కాపు, 30 శాతంగా ఉన్న గవర్ల ఓట్లే కీలకం కానున్నాయి. ఈ రెండు సామాజిక వర్గాలు ఎవరికి మ‌ద్ద‌తు ఇస్తాయో, ఎవ‌రు విజ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తారో వేచి చూడాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + twelve =