త్వరలో వైసీపీ ఎనిమిదో జాబితా విడుదల

YCP eighth list, ycp candidats, AP Elections, CM Jagan,YSRCP,assembly elections,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,andhra pradesh,AP Political updates,Mango News Telugu,Mango News
YCP eighth list, ycp candidats, AP Elections, CM Jagan

ఎన్నికలవేళ వ్యూహాత్మకంగా ముందుకుకదులుతున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. రెండో సారి అధికారం చేజిక్కించకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న జగన్.. ఆచితూచి అడుగులేస్తున్నారు. మిగతా పార్టీలకంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతున్నారు. ఇప్పటికే ఏడు విడతల్లో జగన్ అభ్యర్థులను ప్రకటించారు. పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను మార్చేశారు. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా.. మరికొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఈసారి పోటీ చేయిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఎనిమిదో జాబితా కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ జాబితాను ప్రకటించనున్నారట.

అయితే ఇప్పటికే టికెట్ దక్కించుకున్నవారిని కూడా ఈ జాబితాలో తప్పించనున్నారని.. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించనున్నారని సంబంధిత వర్గాలు అంటున్నాయి. నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను తప్పించి ఆయన స్థానంలో.. డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్‌ను ఇంఛార్జ్‌గా నియమించారు. అయితే ఖలీల్‌‌ను ఇంఛార్జ్‌గా నియమించడాన్ని స్థానిక నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదే విషయంపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.

ఈక్రమంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖలీల్‌పై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరగడం.. సీనియర్ నేతలు వ్యతిరేకిస్తుండడంతో.. ఆయన్ను తప్పించాలని జగన్ నిర్ణయించారట. ఈ మేరకు నెల్లూరు సిటీ నుంచి ఖలీల్ స్థానంలో సినీ నటుడు ఆలీని బరిలోకి దించాలని జగన్ అనుకుంటున్నారట. ఇప్పటికే ఈ విషయంపై ఆలీతో కూడా జగన్ చర్చించారట. అటు ఆలీ కూడా తనకు ఏ సీటు ఇచ్చినా పోటీ చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఈక్రమంలో వైసీపీ ఎనిమిదో జాబితాలో నెల్లూరు సిటీ నుంచి ఆలీ పేరు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

ఈసారి కర్నూల్ సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా జగన్ మార్చనున్నారట. ప్రస్తుతం కర్నూల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఆయన్ను తప్పించి.. కొత్త వారికి జగన్ అవకాశం ఇవ్వనున్నారట. ఇదే విషయంపై గురువారం జగన్.. హఫీజ్ ఖాన్‌తో చర్చలు జరిపారు. పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన పదవి ఇస్తామని హఫీజ్‌ ఖాన్‌కు జగన్ హామీ ఇచ్చారు. ఈక్రమంలో వైసీపీ ఎనిమిదో జాబితాలో కర్నూల్ నుంచి హఫీజ్ ఖాన్ ప్లేసులో కొత్త పేరు ఉంటుందని తెలుస్తోంది. వీరితో పాటు మరికొన్ని స్థానాలకు కూడా ఎనిమిదో జాబితాలో జగన్ ఇంఛార్జ్‌లను ప్రకటించనున్నారట. మొత్తానికి వైసీపీ ఎనిమిదో జాబితా మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 3 =