టీడీపీలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే జంప్.. ముహూర్తం అప్పుడే..

AP Politics, TDP, YCP, Rakshananidhi, Chandrababu naidu,YSRCP,jagan,chadrababu naidu,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Elections,andhra pradesh,Mango News Telugu,Mango News
AP Politics, TDP, YCP, Rakshananidhi, Chandrababu naidu

ఎన్నికలవేళ ఏపీలో నేతల ఫిరాయింపులు సంచలనంగా మారుతున్నాయి. ఓవైపు ప్రజాబలం తగ్గిన వారిని.. నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిన నేతలను పార్టీలు పక్కకు పెట్టేస్తున్నాయి. మరోవైపు టికెట్ దక్కక.. పార్టీలో ప్రాధాన్యత లేక పెద్ద ఎత్తున నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. చొక్కా మార్చినంత సింపుల్‌గా పార్టీ మారిపోతున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సిట్టింగ్‌లకు షాక్ ఇచ్చారు. వారి స్థానంలో కొత్త ముఖాలను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో అసంతృప్తులంతా తెలుగుదేశం, జనసేన పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు వైసీపీని వీడి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు.

ఇటీవల సిట్టింగ్‌ల మార్పులో భాగంగా తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధిని కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైడ్ చేశారు. రక్షణనిధి స్థానంలో తిరువూరు ఇంఛార్జ్‌గా టీడీపీ నుంచి కేశినేని నాని వెంట వైసీపీలోకి వచ్చిన నల్లగట్ల స్వామిదాస్‌కు టికెట్ ఇచ్చారు. ఈక్రమంలో రక్షణనిధి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులు రక్షణనిధి పార్టీ మారుతారని.. తెలుగు దేశం పార్టీలోకి జంప్ అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.  టీడీపీ తరుపున తిరువూరు నుంచి పోటీ చేస్తారని గుసగుసలు వినిపించాయి. కానీ ఈ ప్రచారంపై రక్షణనిధి మాత్రం స్పందించలేదు.

ఇప్పుడు రక్షణనిధికి సంబంధించి మరో విషయం తెరపైకి వచ్చింది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీలో చేరేందుకు రక్షణనిధి గ్రౌండ్ రెడీ చేసుకున్నారట. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా మంతనాలు జరిపారట. అటు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో.. టీడీపీలో చేరేందుకు రక్షణనిధి సిద్ధమయ్యారట. టికెట్ ఆఫర్‌తోనే రక్షణనిధి తెలుగు దేశం పార్టీలోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. తిరువూరు టీడీపీ టికెట్ కోసం పెద్ద ఎత్తున నేతలు పోటీపడుతున్నారు. దేవదత్, కొలికపూడి శ్రీనివాస్‌తో పాటు మరికొందరు నేతలు ఆ టికెట్ ఆశిస్తున్నారు.

అయితే రక్షణనిధి పార్టీలోకి వస్తుండడంతో.. వారందరినీ పక్కకు పెట్టి ఆయన వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారట. తిరువూరు నుంచి రక్షణనిధినే బరిలోకి దించాలని చంద్రబాబు అనుకుంటున్నారట. అటు టికెట్ హామీతో టీడీపీలో చేరేందుకు రక్షణనిధి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకునట్లు తెలుస్తోంది. ఈనెల 26న చంద్రబాబు నాయుడు సమక్షంలో రక్షణనిధి తెలుగు దేశం పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 4 =