ఇండియా ఇంటెన్షన్స్ సర్వే నివేదికలో సంచలన విషయాలు

India intentions, AP Voters, AP, AP Elections,TDP,Jenasena,YSRCP,jagan,pawan kalyan,chandrababau naidu,Andhra Pradesh News Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News,AP Election updates
India intentions, AP Voters, AP, AP Elections

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అటు అయిదేళ్లుగా అధికారానికి దూరంగావున్న చంద్రబాబు నాయుడు.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. జనసేనతో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నారు. అటు బీజేపీ కూడా జనసేన-తెలుగుదేశం పార్టీతో దోస్తీ కట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయితే ఏపీలో ఎన్నికల హడావుడి కొనసాగుతున్నవేళ పలు సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి సంచలన విషయాలను బయటపెడుతున్నాయి. ఇండిపెండెంట్ ఏజెన్సీ ఇండియా ఇంటెన్షన్స్.. ఏపీలో సర్వే చేసి ప్రతివారం ఎన్నికల చిత్ర లహరి పేరుతో నివేదికను విడుదల చేస్తోంది. ఈ వారం ఎన్నికల్లో ఓటర్లు పోలరైజ్ అవుతారా అనే అంశంపై సర్వే చేసి నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 48 శాతం మంది ఓటర్లు సదరు పార్టీ లేదా నాయకుడి పట్ల ద్వేషంతో మరో పార్టీవైపు పోలరైజ్ అవుతారని.. 36 శాతం మంది ఓటర్లు సదరు పార్టీ లేదా నాయకుడి పట్ల అభిమానంతో పోలరైజ్ అవుతారని తేలింది. అదే సమయంలో 16 శాతం మంది ఓటర్లు మాత్రం పోలరైజ్ అవ్వరని నివేదికలో స్పష్టమయింది.

మొత్తం 48 శాతం మంది ఓటర్లు నెగిటీవ్‌గా పోలరైజ్ అవుతుండగా.. అందులో 23 శాతం మంది చంద్రబాబు నాయుడిపై ద్వేషంతో పోలరైజ్ అయ్యే అవకాశముంది. 18 శాతం మంది జగన్మోహన్ రెడ్డిపై ద్వేషంతో.. 7 శాతం మంది పవన్ కళ్యాణ్‌పై ద్వేషంతో పోలరైజ్ అయ్యే అవకాశం ఉందని నివేదికలో తేలింది. అదే సమయంలో 36 శాతం పాజిటీవ్‌గా పోలరైజ్ అయ్యే ఓటర్లలో.. 12 శాతం మంది ఓటర్లు చంద్రబాబు నాయుడిపై అభిమానంతో పోలరైజ్ అవుతారని నివేదికలో తేలింది. అదే సమయంలో 14 శాతం మంది ఓటర్లు వైఎస్ జగన్‌పై అభిమానంతో.. 10 శాతం మంది పవన్ కళ్యాణ్‌పై అభిమానంతో పోలరైజ్ అవుతారని సర్వేలో తేలింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =