ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగ నియామకాల క్యాలెండర్

AP CM YS Jagan Interaction With Srikakulam IIIT, AP CM YS Jagan Interaction With Srikakulam IIIT Students, AP CM YS Jagan Interaction With Srikakulam Students, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, CM YS Jagan Interaction With Srikakulam IIIT Students, Mango News Telugu, YS Jagan Interaction With Srikakulam IIIT Students

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనలో భాగంగా, జిల్లాలోని ఎస్‌ఎమ్‌పురం ట్రిపుల్‌ ఐటీ కళాశాలను సందర్శించారు. అక్కడ తరగతి గదులను, హాస్టల్ బ్లాక్ లను ప్రారంభించారు. ఆ తరువాత ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వై.ఎస్ జగన్ మాట్లాడుతూ, ట్రిపుల్ ఐటీలో నాణ్యతను పెంచి అదనపు సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ట్రిపుల్ ఐటీ లను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ట్రిపుల్ ఐటీలను అభివృద్ధి చేసే చిత్తశుద్ధి తమ ప్రభుత్వానికి ఉందని, ఇక్కడి సమస్యలను పరిస్థితులను యాజమాన్యంను అడిగి తెలుసుకున్నానని వాటన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ముఖాముఖి సమావేశంలో విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వై.ఎస్ జగన్ సమాధానాలు ఇచ్చారు. రాష్ట్ర విభజన వలన 98 శాతం ఐటీని వదులుకుని కేవలం 2 శాతం ఐటీ ఉద్యోగాలతో కొత్త రాష్ట్రంలోకి వచ్చామని చెప్పారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం చేశామని, ప్రతి లోక్ సభ స్థానాన్ని ఒక యూనిట్ గా పరిగణించి స్కిల్ డెవలెప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిషన్ తీసుకువస్తామని చెప్పారు. అలాగే పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాల నియామకానికి చర్యలు తీసుకున్నామని, ఇకపై ప్రతి ఏటా జనవరిలోనే ఉద్యోగ నియామకాల క్యాలెండర్ విడుదల చేసి ఏడాదిలో ఏర్పడిన ఖాళీలను అదే ఏడాదిలో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ పేర్కొన్నారు.

 

[subscribe]
[youtube_video videoid=BGnfdu1iek0]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − twelve =